NTV Telugu Site icon

African Union: జీ-20 సమావేశాల్లో కీలక పరిణామం.. ఆఫ్రికన్‌ యూనియన్‌కు శాశ్వత సభ్యత్వం

Au

Au

African Union Becomes Permanent Member of G-20: ఈరోజు ఉదయం ప్రారంభమైన జీ-20 వన్ ఎర్త్ సెషన్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. జీ-20 సమ్మిట్ లో ఆఫ్రికన్ యూనియన్ కు శాశ్వత సభ్యత్వం ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ ఈ విషయాన్ని ప్రతిపాదించారు. సబ్‌కా సాథ్‌ భావనతోనే ఆఫ్రికన్‌ యూనియన్‌కు జీ20 సభ్యత్వం ఇవ్వాలని భారత్ ప్రభుత్వం ప్రతిపాదిస్తుందని దానికి అందరూ అంగీకరిస్తారని భావిస్తూ ఈ ప్రకటన చేస్తున్నట్లు మోదీ తెలిపారు.  జీ20 సభ్యుడి హోదాలో ఆఫ్రికన్‌ యూనియన్‌ అధ్యక్షుడు అజాలీ అసౌమనీని చైర్ లో కూర్చోవాలని ఆహ్వానించారు. ఆ సమయంలో అజాలీ అసౌమనీ మోడీని ఎంతో ఆప్యాయంగా హత్తుకున్నారు. భారత్ అధ్యక్షతన జరుగుతున్న సమావేశంలో ఇలా ప్రకటించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు మోడీ.

Also Read:
Karnataka: బ్యాంక్ ఉద్యోగులకు షాకింగ్ న్యూస్.. ఆ నిర్ణయం తీసుకోనున్న రాష్ట్రప్రభుత్వం
ఈ సమావేశంలో మాట్లాడిన మోడీ మొరాకో భూకంపంలో మరణించిన వారికి సానుభూతి తెలిపారు. ప్రపంచ దేశాలన్నీ మొరాకోకు సాయం అందించాల్సిన సమయం ఇదని మోదీ అన్నారు. భారత్ ఈ విషయలో పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా జీ-20 వేదికపై మోదీ సబ్‌కా సాథ్‌, సబ్‌కా వికాస్‌, సబ్‌కా విశ్వాస్‌, సబ్‌కా ప్రయాస్‌ మంత్రం అందరికి ఆదర్శం అన్నారు. దేశం లోపల, బయట అందరిని కలుపుకొని పోవడానికి భారత్ సిద్ధంగా ఉందని మోడీ వెల్లడించారు. ప్రపంచంలో యుద్దాలు, కరోనా వంటి మహమ్మారి కారణంగా అపనమ్మకం ఏర్పడిందని వాటిని పోగొట్టుకొని ముందుకు సాగాలన్నారు. ప్రపంచంలో పేద, సంపన్న దేశాల మధ్య భేదాలు, ఆహారం, ఇంధనం నిర్వహణ, హెల్త్‌, ఎనర్జీ, నీటి భద్రత వంటి సమస్యలకు సమాధానం కోసం అన్వేషించడానికి 21 శతాబ్దం ఎంతో ముఖ్యమైనదన్నారు. ఇక ఇప్పుడు శాశ్వత సభత్వం పొందించిన ఆఫ్రికన్ యూనియన్ తో పాటు  అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, భారతదేశం, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, దక్షిణ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ స్టేట్స్ మరియు యూరోపియన్ యూనియన్ జీ-20 గ్రూప్ లో భాగంగా ఉన్నాయి. ఇక ఆఫ్రికన్ యూనియన్ విషయానికి వస్తే దీనిలో 55 మెంబర్ స్టేట్స్ ఉండి మొత్తం ఆఫ్రికా ఖండాన్నే ఇది రిప్రెజెంట్ చేస్తుంది.