NTV Telugu Site icon

Seven Sixes: ఒకే ఓవర్‌లో 7 సిక్సర్లు కొట్టిన ఆప్ఘనిస్థాన్ యువ క్రికెటర్

7 Sixes

7 Sixes

ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన 21 ఏళ్ల బ్యాట్స్‌మెన్ సెడిఖుల్లా అటల్ ఒకే ఓవర్‌లో 7 సిక్సర్లు కొట్టి రుతురాజ్ గైక్వాడ్ రికార్డును సమం చేశాడు. బౌలర్ అమీర్ జజాయ్ వేసిన ప్రతి బంతిని సిక్సర్ కొట్టాడు. కాబూల్ ప్రీమియర్ లీగ్ లో షాహీన్ హంటర్స్ మరియు అబాసిన్ డిఫెండర్స్ జట్టు పోటీపడింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన షాహీన్ హంటర్స్.. కేవలం 16 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన అటల్.. చివరి వరకు క్రీజులో ఉండి.. ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. 56 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్సర్లతో 118 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అయితే 19వ ఓవర్‌లో దుమారం రేపాడు.

Brahmanandam: కుటుంబ సమేతంగా సీఎం కేసీఆర్‌ను కలిసిన బ్రహ్మానందం.. ఎందుకంటే?

జజాయ్ వేసిన 19వ ఓవర్ తొలి బంతికి అటల్ సిక్సర్ కొట్టాడు. తర్వాతి బంతిని వైడ్‌ వేశాడు జజాయ్. ఆ తర్వాత.. 6 బంతులను ఎదుర్కొని.. సిక్సర్ల మోత మోగించాడు. దీంతో జజాయ్ 19వ ఓవర్‌లో మొత్తం 48 పరుగులు చేశాడు. మరోవైపు ఒకే ఓవర్‌లో 7 సిక్సర్లు బాది భారత బ్యాట్స్‌మెన్ రుతురాజ్ గైక్వాడ్ రికార్డును సమం చేశాడు. గైక్వాడ్ గతేడాది విజయ్ హజారే ట్రోఫీలో వరుసగా 7 సిక్సర్లు కొట్టి అద్భుత ప్రదర్శన చేశాడు.

Uttam Kumar Reddy: బీఆర్ఎస్ లో చేరికపై క్లారిటీ ఇచ్చిన ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి

19వ ఓవర్ లో షాహీన్ జట్టు స్కోరు 158 ఉండగా.. ఓవర్ అయిపోయేసరికి 206 పరుగులకు చేరింది. ఆ తర్వాత చివరి ఓవర్‌లో నవేద్ జద్రాన్ 7 పరుగులు ఇచ్చాడు. దీంతో షాహీన్ 213 పరుగులు చేసింది. 214 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన డిఫెండర్లను షాహీన్ హంటర్స్ 18.3 ఓవర్లలో 121 పరుగులకే ఆలౌట్ చేశారు.