Afg Vs Ban: టెస్ట్ క్రికెట్‌లోనే ఆఫ్ఘనిస్థాన్ అద్భుత పోరాటం.. ఏకంగా 142 ఓవర్లు ఆడి మ్యాచ్ డ్రా..

Afg

Afg

బంగ్లాదేశ్‌తో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ జట్టు అద్భుతమైన పోరాటంతో ఓటమి కోరల నుంచి బయటపడి మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. ఈ మ్యాచ్‌లో అఫ్గాన్ బ్యాటర్ సిదిఖుల్లా అటల్ అజేయంగా నిలిచి తన తొలి టెస్ట్ సెంచరీ నమోదు చేయడంతో పాటు జట్టును గట్టెక్కించాడు. ఐదో రోజు ఆటలో భాగంగా అఫ్గానిస్తాన్ దాదాపు 92 ఓవర్లపాటు క్రీజులో నిలబడి మొత్తం 142 ఓవర్లు బ్యాటింగ్ చేయడం విశేషం. చివరి రోజు ఆట మొదలయ్యేసరికి 3 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసిన స్థితి నుంచి అఫ్గాన్ బ్యాటర్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నారు.

అయితే తొలుత టెండర్ బ్యాటర్ అటల్ సుమారు ఎనిమిదిన్నర గంటలపాటు క్రీజులో కష్టపడి 332 బంతుల్లో 111 పరుగులు సాధించాడు. అతనితో పాటు కిందిస్థాయి బ్యాటర్లు కూడా అద్భుత సంయమనం ప్రదర్శించారు. 34 ఏళ్ల యామిన్ అహ్మదజాయ్ 85 బంతుల్లో 19 పరుగులు చేయగా, కైస్ అహ్మద్ గాయపడినప్పటికీ పట్టుదలగా ఆడి అజేయంగా 49 పరుగులు సాధించి జట్టును ఓటమి నుంచి కాపాడారు.

బంగ్లాదేశ్ బౌలర్లు విజయం కోసం చివరి వరకు తీవ్రంగా శ్రమించినా, అఫ్గాన్ లోయర్ ఆర్డర్ బ్యాటర్ల అసాధారణ పోరాటం ముందు వారి ప్రయత్నాలు ఫలించలేదు. చివరికి అఫ్గానిస్తాన్ రెండో ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 346 పరుగులు చేసి చారిత్రాత్మక డ్రాను సాధించింది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ వికెట్ కీపర్ లిటన్ దాస్ సెంచరీ సాధించడంతో పాటు మ్యాచ్‌లో కీపింగ్ చేస్తూ తొమ్మిది మంది బ్యాట్స్ మెన్స్ ను అవుట్ చేసి రికార్డు సృష్టించినప్పటికీ, అఫ్గానిస్తాన్ ఆటగాళ్ల పట్టుదల ముందు విజయం సాధించలేకపోయింది.