Site icon NTV Telugu

Afghanistan: ఆకస్మిక వరదలు.. 17 మంది మృతి, రోడ్డున్న పడ్డ 1,800 కుటుంబాలు..!

Afghanistan

Afghanistan

Afghanistan: అఫ్గానిస్తాన్‌లో పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా అకస్మిక వరదలు సంభవించడంతో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనల్లో మరో 11 మంది గాయపడినట్లు అఫ్గానిస్తాన్ జాతీయ విపత్తుల నిర్వహణ ప్రాధికార సంస్థ (ANDMA) ప్రకటించింది. దేశవ్యాప్తంగా చాలా కాలంగా కొనసాగుతున్న కరువుకు తొలి భారీ వర్షాలు ముగింపు పలికినప్పటికీ.. ఈ సమయంలో వచ్చిన వరదలు ప్రజల్ని తీవ్రంగా కలవరపెట్టాయి.

OTR: నల్గొండ కాంగ్రెస్ రచ్చ.. డిసిసి పీట పై ఉక్కుపాదం

అక్కడి అధికార ప్రతినిధి తెలిపిన వివరాల ప్రకారం.. ఈ తీవ్ర వాతావరణ పరిస్థితులు మధ్య, ఉత్తర, దక్షిణ, పశ్చిమ అఫ్గానిస్తాన్ ప్రాంతాల్లో సాధారణ జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయన్నారు. వరదల వల్ల పలు జిల్లాల్లో మౌలిక సదుపాయాలకు నష్టం వాటిల్లగా, పశువులు కూడా మృతి చెందాయని తెలిపారు. ఈ ప్రకృతి విపత్తు కారణంగా దాదాపు 1,800 కుటుంబాలు ప్రభావితమయ్యాయని.. ఇప్పటికే బలహీనంగా ఉన్న పట్టణ, గ్రామీణ సముదాయాల పరిస్థితి మరింత దుర్భరంగా మారింది.

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

హెరాత్ ప్రావిన్స్‌లోని కాబకాన్ జిల్లాలో ఒక ఇంటి పైకప్పు కూలిపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్లు హెరాత్ ప్రావిన్స్ గవర్నర్ ప్రతినిధి మహ్మద్ యూసుఫ్ సయీది వెల్లడించారు. సోమవారం నుంచి వరదలు ప్రభావితం చేసిన జిల్లాల్లోనే ఎక్కువగా ప్రాణనష్టం చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. వరదల తీవ్రతను అంచనా వేసేందుకు ANDMA ఇప్పటికే అత్యంత ప్రభావిత ప్రాంతాలకు ప్రత్యేక బృందాలను పంపించింది. ప్రజల తక్షణ అవసరాలు, నష్టాలపై సమగ్ర సమాచారం సేకరించేందుకు సర్వేలు కొనసాగుతున్నాయని అధికారి తెలిపారు.

Exit mobile version