NTV Telugu Site icon

NZ vs AFG: 7 క్యాచ్‌లు మిస్.. తగిన మూల్యం చెల్లించుకున్న ఆఫ్ఘాన్..

Afg Catch Miss

Afg Catch Miss

NZ vs AFG: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా.. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో న్యూజిలాండ్-ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. అయితే పేలవమైన ఫీల్డింగ్ కారణంగా.. కెప్టెన్‌తో సహా చాలా మంది ఆటగాళ్లు క్యాచ్ లు పట్టడంలో విఫలమయ్యారు. ఆఫ్ఘాన్ ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు మొత్తం 7 క్యాచ్‌లను వదులుకుంది. ఇది మ్యాచ్‌ ఓటమికి కారణంగా మారవచ్చు.

Read Also: Israel-Hamas War: హమాస్‌ ఫైనాన్షియర్లపై అమెరికా ఉక్కపాదం.. ఖతార్, టర్కీ, గాజాలో పలువురిపై ఆంక్షలు..

ఈ మ్యాచ్ లో కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ, ముజీబ్ రెహమాన్, రషీద్ ఖాన్ క్యాచ్‌లు మిస్ చేశారు. అయితే రషీద్ మిస్ చేసిన క్యాచ్ కష్టమైన క్యాచ్ అయినప్పటికీ.. 2 సులభమైన క్యాచ్‌లను కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ వదులుకున్నాడు. దీంతో రషీద్ క్యాచ్ మిస్ చేయడంతో.. గ్లెన్ ఫిలిప్స్ కు లైఫ్ ఇచ్చినట్లు అయింది. దీంతో అతను క్రీజులో నిలకడగా ఆడి ఇన్నింగ్స్‌లో 71 పరుగులు చేశాడు. అఫ్ఘాన్‌ ఆటగాళ్లలో విల్‌ యంగ్‌, రచిన్‌ రవీంద్ర, గ్లెన్‌ ఫిలిప్స్‌, కివీస్‌ కెప్టెన్‌ టామ్‌ లాథమ్‌ సహా పలువురు ఆటగాళ్లు క్యాచ్‌లు జారవిడిచారు. అయితే మిస్ చేసిన క్యాచ్‌ల వీడియోలను కొన్ని ఐసీసీ షేర్ చేసింది.

Read Also: Atchannaidu: చంద్రబాబు సహా టీడీపీ నేతలపై పెట్టిన అక్రమ కేసులను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాం..

తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. జట్టు తరఫున ఎనిమిదో స్థానంలో వచ్చిన కెప్టెన్ టామ్ లాథమ్ 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 68 (74 బంతుల్లో) పరుగులు చేయగా, ఎనిమిదో స్థానంలో వచ్చిన గ్లెన్ ఫిలిప్స్ 71 (80) పరుగులు చేశాడు. వీరి మధ్య 144 పరుగుల (153 బంతులు) భాగస్వామ్యం ఉంది.