Site icon NTV Telugu

AFG vs BAN: కన్నెర్ర చేసిన ఆఫ్ఘనిస్తాన్.. బంగ్లాదేశ్‭పై భారీ విజయం

Afg Vs Ban

Afg Vs Ban

AFG vs BAN: షార్జా క్రికెట్ స్టేడియం వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ జట్టు 92 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. షార్జా స్టేడియంలో జరిగిన 300వ వన్డే మ్యాచ్ ఇది. ఈ ఘనత సాధించిన తొలి స్టేడియంగా షార్జా నిలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన 235 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఇక లక్ష్య ఛేదనకు వచ్చిన బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్స్ ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లు దెబ్బకు కుప్పకూలారు. దాంతో మొత్తం జట్టు 34.3 ఓవర్లలోనే 143 పరుగులకే కుప్పకూలింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆఫ్ఘనిస్థాన్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.

Read Also: Hemoglobin Levels: మీ రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటే జరిగే అనర్థాలు ఇవే

గజన్‌ఫర్‌ కేవలం 6.3 ఓవర్లలో 26 పరుగులిచ్చి ఆరు వికెట్లు తీశాడు. రషీద్ ఖాన్ రెండు వికెట్లు తీశాడు. వీరిద్దరితో పాటు మహ్మద్‌ నబీ, అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌లకు ఒక్కో వికెట్ దక్కింది. బంగ్లాదేశ్ టాప్ ఆర్డర్ పోరాడేందుకు ప్రయత్నించింది. కానీ, ఎవరూ మంచి ప్రారంభాన్ని పెద్ద ఇన్నింగ్స్‌గా మార్చలేకపోయారు. బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో జట్టు తరఫున అత్యధికంగా 47 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 68 బంతులలో నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు కొట్టాడు. ఓపెనర్ సౌమ్య సర్కార్ 33 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు. మెహెదీ హసన్ మిరాజ్ 28 పరుగులు చేశాడు.

Read Also: Cardiac Arrests: గుండెపోటుకు గురికాకూడదనుకునే వారు వీటిని అలవాటు చేసుకోవాల్సిందే

షార్జా పిచ్‌పై అఫ్గానిస్థాన్ బ్యాట్స్‌మెన్ కూడా కష్టపడ్డారు. ఆ జట్టు అనుభవజ్ఞుడైన మహ్మద్‌ నబీ జట్టు బాధ్యతలు చేపట్టి 79 బంతుల్లో 84 పరుగుల ఇన్నింగ్స్‌ ఆడి 200 పరుగులు దాటడంలో సహకరించాడు. నబీ తన ఇన్నింగ్స్‌లో నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు బాదాడు. ఆఫ్ఘనిస్థాన్ కెప్టెన్ హస్మతుల్లా షాహిదీ 92 బంతుల్లో 2 ఫోర్లతో 52 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్‌లో తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్ చెరో వికెట్ తీశారు. షోరిఫుల్ ఇస్లాం ఒక వికెట్ తీశాడు.

Exit mobile version