Site icon NTV Telugu

Rashid Khan : గాంధీనగర్ గల్లీలో రషీద్ ఖాన్ హంగమా

Rashed Khan

Rashed Khan

ఆప్ఘనిస్తాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ భారత్ లో గల్లీ క్రికెట్ ఆడాడు. గాంధీ నగర్ లో ఆయన భారత అభిమానులతో కలిసి సరదాగా క్రికెట్ ఆడాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో నెటిజన్లకు సైతం విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఐపీఎల్ 2023లో భాగంగా రషీద్ భారత్ కి వచ్చారు. గుజరాత్ టైటాన్స్ జట్టు రషీద్ ఖాన్ ను కొనుగోలు చేసింది. కాగా, శుక్రవారం జరిగిన మ్యాచ్ లో గుజరాత్ గెలుపులో రషీద్ ఖాన్ కీలక పాత్ర పోషించాడు. కాగా, ఈ మ్యాచ్ కి ముందు రోజు రషీద్ గల్లీ క్రికెట్ ఆడాడు. మ్యాచుల్లో తన బౌలింగ్‌లో ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టే అతను ఇక్కడ మాత్రం బ్యాటింగ్‌తో అదరగొట్టాడు.

Also Read : Ghee: నెయ్యి ఆరోగ్యమే కాదు అందాన్ని కూడా పెంచుతుంది

కొంత మంది యువకులు గల్లీలో క్రికెట్ ఆడుతూ కన్పించగా.. అక్కడ ప్రత్యక్షమైన రషీద్ ఖాన్.. అక్కడున్నా..అందరినీ సర్‌ప్రైజ్ చేశాడు. బ్యాటింగ్ చేసి అందరినీ అలరించాడు. మరి రషీద్ ఖాన్ బ్యాటింగ్‌ను ఎంజాయ్ చేశాడు. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోను ముఫద్దల్ వోహ్రా అనే వినియోగదారు తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేశారు. 26 సెకన్ల క్లిప్‌లో, రషీద్ ఖాన్ గుజరాత్‌లోని గాంధీనగర్‌లో గల్లీ క్రికెట్ ఆడుతున్నట్లు మనం చూడవచ్చు. అతను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు చుట్టుపక్కల ప్రజలు ఉత్సాహంగా వీడియోలు తీయడం మనం చూడొచ్చు. భారత అభిమానులతో గల్లీ క్రికెట్ ఆడుతున్న రషీద్ ఖాన్ అంటూ వీడియోకి క్యాప్షన్ జత చేశారు. ఐపీఎల్ లో తమ ఫెవరేట్ క్రికెటర్ ఇలా తమతో క్రికెట్ ఆడటంతో అక్కడి ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.

Also Read : AP SSC Results 2023: టెన్త్‌ ఫలితాలు విడుదల.. బాలికలదే పైచేయి.. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Exit mobile version