Site icon NTV Telugu

Afghanistan Cricket: చరిత్ర సృష్టించిన ఆఫ్గనిస్తాన్.. ప్రపంచంలోనే మొదటి టీమ్!

Afghanistan Create History

Afghanistan Create History

ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు బంగ్లాదేశ్‌తో జరిగిన 3 వన్డేల సిరీస్‌లో సంచలన ప్రదర్శన చేసింది. అబుదాబిలో అక్టోబర్ 14న జరిగిన చివరి మ్యాచ్‌లో భారీ తేడాతో గెలిచి.. సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఇది ఆఫ్ఘనిస్తాన్‌కు వరుసగా 5వ వన్డే సిరీస్ విజయం కావడం విశేషం. చివరి వన్డే మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఏకంగా 200 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అబుదాబిలో ఈ రికార్డు తేడాతో ఓడిపోవడం బంగ్లాదేశ్‌కు ఇదే మొదటిసారి.

ఆఫ్ఘనిస్తాన్‌కు వరుసగా ఐదో వన్డే సిరీస్ విజయాన్ని అందించడంలో ఇబ్రహీం జద్రాన్ కీలక పాత్ర పోషించాడు. ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో జద్రాన్ మొత్తం 213 పరుగులు సాధించాడు. అయితే ఈ సిరీస్‌లో జద్రాన్ రెండుసార్లు సెంచరీని కేవలం 5 పరుగుల తేడాతో కోల్పోయాడు. సిరీస్‌లో రెండో, మూడో వన్డేల్లో అతడు 95 పరుగుల ఇన్నింగ్స్ ఆడటం విశేషం. అబుదాబిలో ఒక జట్టు 200 పరుగుల తేడాతో వన్డేను గెలుచుకోవడం ఇదే మొదటిసారి. ఈ వేదికపై దక్షిణాఫ్రికా 2024లో ఐర్లాండ్‌ను 174 పరుగుల తేడాతో ఓడించింది.

Also Read: Gold Rate Today: బంగారం ధరలు మళ్లీ జంప్.. హైదరాబాద్‌లో తులం లక్ష 29 వేలు!

ఇక చివరి వన్డేలో ఆఫ్ఘనిస్తాన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 293 పరుగులు చేసింది. 294 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్‌లకు ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లు చుక్కలు చూపించారు. వారిని అడ్డుకోలేక కేవలం 27.1 ఓవర్లలో 93 పరుగులకే ఆలౌట్ అయ్యారు. ఫలితంగా ఆఫ్ఘనిస్తాన్ 200 పరుగుల భారీ తేడాతో మ్యాచ్‌ను గెలిచి, సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది.

 

Exit mobile version