NTV Telugu Site icon

Bikes Under One Lakh : కేవలం లక్షలోపు మార్కెట్లో లభించే బెస్ట్ స్కూటర్లు ఇవే.. అదుర్స్ అనిపించే ఫీచర్లు, మైలేజ్

New Project (60)

New Project (60)

Bikes Under One Lakh : ఒకప్పుడు ఇంటికో సైకిల్ ఉన్నట్లు ప్రస్తుతం ఇంటికో బైక్ కామన్ అయిపోయింది. జనాభా పెరుగుతున్నట్లే బైక్ లకు డిమాండ్ కూడా భారీగా పెరుగుతుంది. దీంతో అనేక కొత్త కంపెనీలు కూడా మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తున్నాయి. పాత కంపెనీలు, పాతుకు పోయిన కంపెనీలు కొత్త కొత్త్ మోడల్స్ మార్కెట్లోకి ప్రవేశ పెడుతున్నాయి. దీంతో భారత మార్కెట్లో ద్విచక్ర వాహనాలకు పోటీ బాగా పెరిగిపోయింది. ప్రస్తుతం బైకులు, స్కూటర్లు సామాన్యులకు ఓ అవసరంగా మారాయి. మార్కెట్లో బలమైన మైలేజీని అందించే.. బడ్జెట్ కు అనుగుణంగా ఉండే అనేక బైకులు ఉన్నాయి. ఈ వాహనాల జాబితాలో టీవీఎస్, హోండా, హీరో, బజాజ్ మోడళ్లు ఉన్నాయి. ఈ బైక్ ధర, ఫీచర్ల గురించి తెలుసుకుందాం.

టీవీఎస్ జూపిటర్
టీవీఎస్ జూపిటర్‌లో సింగిల్-సిలిండర్, 4-స్ట్రోక్, 2-వాల్వ్ ఇంజిన్ తో వస్తుంది. టీవీఎస్ స్కూటర్‌లోని ఈ ఇంజన్ 6,500 rpm వద్ద 5.9కిలో వాట్ల పవర్, 4,500 rpm వద్ద 9.8 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ స్కూటర్ సీవీటీ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. ఈ స్కూటర్ ARAI సర్టిఫైడ్ మైలేజ్ లీటరుకు 53కిలో మీటర్ల మైలేజ్ ఇస్తుంది. టీవీఎస్ జూపిటర్ ఎక్స్-షోరూమ్ ధర రూ.74,691 నుండి మొదలవుతుంది.

Read Also:Royal Enfield Hunter 350 : ఈ బైక్ పై భారీగా మనసు పడ్డ జనం.. ఇప్పటి వరకు ఎన్ని లక్షలు అమ్ముడయ్యాయో తెలిస్తే షాకే

హీరో గ్లామర్
హీరో గ్లామర్ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ మోటార్ సైకిల్. ఈ బైక్‌లో ఎయిర్-కూల్డ్, 4-స్ట్రోక్ ఇంజిన్ అమర్చబడి ఉంటుంది. ఈ మోటార్ సైకిల్ లోని ఇంజన్ 7,500 rpm వద్ద 7.75 కిలో వాట్స్ పవర్, 6,000 rpm వద్ద 10.4న్యూటన్ మీటర్ల టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్‌కు ఫ్యూయెల్ ఇంజెక్షన్ సిస్టమ్ కూడా లభిస్తుంది. ఈ హీరో బైక్ లీటరుకు 55 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని పేర్కొంది. హీరో గ్లామర్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 83,098 నుండి మొదలవుతుంది.

హోండా యాక్టివా
దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్లలో హోండా యాక్టివా ఒకటి. హోండా నుండి వచ్చిన ఈ స్కూటర్ 4-స్ట్రోక్ ఎస్ఐ ఇంజిన్‌తో వస్తుంది. స్కూటర్‌లోని ఇంజిన్ 5.77కిలో వాట్స్ పవర్ ను, 8.90న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ స్కూటర్‌లో PGM-Fi ఫ్యూయెల్ సిస్టమ్ అమర్చబడి ఉంటుంది. హోండా స్కూటర్ వీల్ బేస్ 1260 మిమీ, గ్రౌండ్ క్లియరెన్స్ 162 మిమీ. ఢిల్లీలో హోండా యాక్టివా ఎక్స్-షోరూమ్ ధర రూ.78,684 నుండి ప్రారంభమవుతుంది. దేశంలోని ఇతర నగరాల్లో కూడా ధరలో కాస్త వ్యత్యాసం ఉంటుంది.

Read Also:Adinarayana Reddy: వైసీపీ నుంచి బయటకు వచ్చిన విజయసాయి రెడ్డికి అభినందనలు!

బజాజ్ ప్లాటినా
బజాజ్ ప్లాటినాలో 4-స్ట్రోక్, DTS-i, సింగిల్ సిలిండర్ ఇంజిన్ తో వస్తుంది. ఈ బైక్‌లో ఎలక్ట్రానిక్ ఫ్యూయెల్ ఇంజెక్షన్ సిస్టమ్ కూడా ఉంది. బజాజ్ బైక్‌లోని ఇంజిన్ 7,500 rpm వద్ద 5.8కిలో వాట్స్ పవర్, 5,500 rpm వద్ద 8.3 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. బజాజ్ మోటార్ సైకిల్ గరిష్ట వేగం గంటకు 90 కి.మీ. ఈ బైక్ లీటర్‌కు 72 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఈ బజాజ్ మోటార్ సైకిల్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 68,685 నుండి మొదలవుతుంది.