Royal Enfield Hunter 350 : ఈ బైక్ పై భారీగా మనసు పడ్డ జనం.. ఇప్పటి వరకు ఎన్ని లక్షలు అమ్ముడయ్యాయో తెలిస్తే షాకే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Royal Enfield Hunter 350 : రాయల్ ఎన్ఫీల్డ్ మూతపడుతుంది అనుకున్న కంపెనీ ప్రస్తుతం మార్కెట్లో నంబర్ 1గా ఎదిగింది. ఈ బైక్ ల కోసం జనాలు కొన్ని నెలల పాటైనా వేచి చూసేందుకు సిద్ధంగా ఉన్నారు. అంతలా బైక్ పై క్రేజ్ పెంచుకున్నారు. పేరులోని రాయల్ వాళ్ల లైఫ్ లో బండితో రావాలని కోరుకుంటున్నారు. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌లు భారత మార్కెట్లో బాగా ప్రాచుర్యం పొందాయి. ఈ బ్రిటిష్ బ్రాండ్ మోటార్ సైకిళ్లకు మార్కెట్లో డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. రాయల్ ఎన్ ఫీల్డ్ హంటర్ 350 అమ్మకాలలో కొత్త మైలురాయిని సాధించింది.
ఈ రాయల్ బైక్ ఇప్పటి వరకు ఐదు లక్షల యూనిట్లకు పైగా అమ్ముడయ్యాయి. రాయల్ హంటర్ 350 ఆగస్టు 2022లో భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఫిబ్రవరి 2023 నాటికి ఈ మోటార్ సైకిల్ లక్ష యూనిట్లు అమ్ముడు పోయాయి. తదుపరి ఐదు నెలల్లో మరో లక్ష యూనిట్లు అమ్ముడయ్యాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈ బైక్ భారీ అమ్మకాల కారణంగా బ్రాండ్ అత్యంత ప్రజాదరణ పొందిన మోటార్‌సైకిల్‌గా మారిపోయింది.
Also Read
- Gudivada Amarnath: చంద్రబాబు ఏం చేసినా అమ్మకాలే.. గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
- Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
- Jani Master: జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం..
- Subsidised Onions: సామాన్యులకు గుడ్‌న్యూస్.. సబ్సిడీపై ఉల్లిపాయల విక్రయాలు..
Read Also:Adinarayana Reddy: వైసీపీ నుంచి బయటకు వచ్చిన విజయసాయి రెడ్డికి అభినందనలు!
రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350
రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 బ్రాండ్ నుండి అత్యంత సరసమైన మోటార్ సైకిళ్లలో ఒకటి. ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.5 లక్షల నుండి ప్రారంభమై రూ. 1.75 లక్షల వరకు ఉంటుంది. భారతదేశంతో పాటు బ్రిటిష్ ఆటోమేకర్ల ఈ బైక్ ఇండోనేషియా, జపాన్, కొరియా, థాయిలాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, యునైటెడ్ కింగ్‌డమ్‌తో సహా అనేక దేశాల్లో అమ్ముడవుతుంది. ఇది కాకుండా మెక్సికో, ఆస్ట్రేలియా, బ్రెజిల్‌లలో కూడా ఈ బైక్‌కు డిమాండ్ ఉంది.
హంటర్ 350 పవర్, మైలేజ్
ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్‌లో 349 సిసి, సింగిల్-సిలిండర్, 4-స్ట్రోక్, ఎయిర్-ఆయిల్ కూల్డ్ ఇంజిన్ తో రాబోతుంది. ఇది ఫ్యూయెల్ ఇంజెక్షన్ సిస్టమ్ కూడా కలిగి ఉంది. హంటర్ 350 లోని ఈ ఇంజన్ 6,100 rpm వద్ద 20.2 bhp పవర్, 4,000 rpm వద్ద 27 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. బైక్‌లోని ఇంజిన్‌తో పాటు 5-స్పీడ్ గేర్‌బాక్స్ వస్తుంది. ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ ARAI సర్టిఫైడ్ మైలేజ్ లీటర్‌కు 36.2 కి.మీ. ఈ బైక్ 13 లీటర్ల ఫ్యూయెల్ కెపాసిటీతో వస్తుంది. ఒక్కసారి ఫుల్ ట్యాంక్ చేస్తే 468 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించవచ్చు.
Read Also:Swift VS Dzire : మారుతి స్విఫ్ట్ లేదా డిజైర్.. ఏది బెస్ట్.. మంచి మైలేజీ ఇచ్చే కారు ఇదే ?
తాజావార్తలు
-
IND vs WI 2nd ODI: భారత్, వెస్టిండీస్ రెండో వన్డే.. తెలుగోడు అవుట్.. అరంగేట్రం చేసిన దేశవాళీ కింగ్!
-
Gudivada Amarnath: చంద్రబాబు ఏం చేసినా అమ్మకాలే.. గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Jani Master: జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం..
-
Subsidised Onions: సామాన్యులకు గుడ్‌న్యూస్.. సబ్సిడీపై ఉల్లిపాయల విక్రయాలు..
ట్రెండింగ్
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!