కిక్కుకోసం జనం జీవితాలతో ఆడుకుంటున్నారు కొంత మంది కేటుగాళ్లు. కల్తీ కల్లు తయారు చేస్తూ జనాల ఆరోగ్యాన్ని గుల్ల చేస్తున్నారు. అాలాంటి ముఠాకు నిర్మల్ జిల్లా పోలీసులు చెక్ పెట్టారు. ఆల్పాజోలం, క్లోరో హైడ్రేట్ లాంటి మత్తు పదార్థాలను భారీ ఎత్తున పట్టుకున్నారు. బీరు.. బ్రాందీ.. విస్కీ.. వోడ్కా.. ఇలాంటి ఆల్కహాల్ తాగడం కంటే చెట్టు నుంచి వచ్చిన స్వచ్ఛమైన కల్లు తాగడం ఆరోగ్యానికి మంచిదని అందరూ చెబుతుంటారు. కానీ ఆరోగ్యం మాట దేవుడెరుగు.. అసలు ఇప్పుడు దొరికే కల్లు తాగడం వల్ల ప్రాణాలే పోతాయనే విషయం అర్ధమవుతోంది. ఎక్కడ పడితే అక్కడ కల్తీ కల్లు సరఫరా కావడమే ఇందుకు కారణం…
ఓ వైపు చెట్ల నుంచి కల్లు గీయడం తక్కువైపోయింది. మరోవైపు లిక్కర్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ క్రమంలో కల్తీ కల్లు రాజ్యమేలుతోంది. కొంత మంది దీన్ని అడ్డం పెట్టుకుని కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. అసలు కల్లు రాకపోవడంతో కల్తీ చేసి మరీ డ్రమ్ముల కొద్దీ కల్లు సరఫరా చేస్తున్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో ఈ దందా ఎక్కువగా సాగుతోంది…
కోటగిరి రాజన్న, ఎల్లందుల శ్రీనివాస్. కొన్నిచోట్ల మామూళ్లతో నోళ్లు మూయించి తమ అక్రమ దందా సాగిస్తున్నారు వ్యాపారులు. ఐతే తాజాగా నిర్మల్ జిల్లాలో 425 కేజీల క్లోరోహైడ్రేట్, కేజీ ఆల్ఫా జోలం సీజ్ చేశారు ఎక్సైజ్ అధికారులు. రెండు కార్లలో వాటిని తరలిస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. పట్టుబడిన వారిలో బుర్ర రమేష్ గౌడ్, బాసుపల్లి రామ గౌడ్, బుర్ర రాజశేఖర్, కోటగిరి రాజన్న, ఎల్లందుల శ్రీనివాస్ ఉన్నారు. వారి పై కేసు నమోదు రిమాండ్‌కి తరలించారు పోలీసులు… మహరాష్ట్రలో ఇక్కడి ప్రాంతానికి చెందిన వారు అక్కడి యూనిట్‌లో తయారు చేసి ఇక్కడికి సరఫరా చేస్తున్నారని గుర్తించారు. నిర్మల్, జగిత్యాలతోపాటు ఆదిలాబాద్ సహా ఇతర జిల్లాలకు ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నారని పోలీసులు వెల్లడించారు. కల్లు బట్టీల నిర్వాహకులకు ఇది సరఫరా అవుతుందని తెలిపారు. ఆల్ఫాజోలం, క్లోరో హైడ్రెట్ కలిపిన కల్లు తాగడం వల్ల అనారోగ్యాల బారిన పడడమే కాకుండా ఒక్కోసారి ప్రాణాలు కూడా పోతాయని నిపుణులు వార్నింగ్ ఇస్తున్నారు..
