NTV Telugu Site icon

Kamareddy: కామారెడ్డిలో మరోసారి కల్తీకల్లు కలకలం.. 30 మందికి అస్వస్థ, ఆరుగురు సీరియస్!

Adulterated Kallu

Adulterated Kallu

కామారెడ్డి జిల్లాలో మరోసారి కల్తీకల్లు కలకలం రేపింది. గాంధారి మండలం గౌరారంలో కల్తీకల్లు తాగి 30 మంది అస్వస్థకు గురయ్యారు. అందులో ఆరుగురి పరిస్థితి సీరియస్‌గా ఉంది. బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కామారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్ ఐసీయూలో ఆరుగురు బాధితులు చికిత్స పొందుతున్నారు. గౌరారంలోని కల్లు దుకాణంలో కల్లు తాగిన వారు వింతగా ప్రవర్తిస్తున్నారు. కుస్తీ పోటీల సందర్భంగా గౌరారం గ్రామానికి చెందిన గ్రామస్తులు కల్లు తాగారు. కల్లు దుకాణంపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

Also Read: Land Issue: కమ్మగుడలో ఉద్రిక్తత.. యజమానులను భయభ్రాంతులకు చేసిన భూమాఫియా గ్యాంగ్!

మంగళవారం కూడా కామారెడ్డి జిల్లాలో కల్తీకల్లు కలకలం రేపిన విషయం తెలిసిందే. నస్రుల్లాబాద్ మండలం దుర్కి గ్రామంలోని ఓ కల్లు దుకాణంలో కల్తీకల్లు తాగిన 22 మంది వింతగా ప్రవర్తించారు. అందరూ పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుండటంతో కుటుంబసభ్యులు బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాధితుల్లో నస్రుల్లాబాద్ మండలంలోని అంకోల్, సంగెం, హాజీపూర్, దుర్కి గ్రామాలకు చెందిన వారు ఉన్నారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో.. నిజామాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. కల్తీ కల్లు కేసు ఘటన వెలుగు చూడటంతో ఎక్సైజ్ అధికారులు కేసు నమోదు చేశారు.