NTV Telugu Site icon

Chandra Babu Naidu: చంద్రబాబు ఇద్దరు పీకేలను విమర్శించి.. వాళ్లనే పక్కన పెట్టుకున్నాడు!

Chandrababu

Chandrababu

Narayana Swamy Slams Chandra Babu Naidu: ఒకప్పుడు ఇద్దరు పీకేలను విమర్శించి.. ఇప్పుడు వాళ్లనే పక్కన పెట్టుకున్నాడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి విమర్శించారు. చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో ఎలాంటి అభివృధి, సంక్షేమం పాలన అందించ లేదన్నారు. చంద్రబాబుకు ఎస్సీలను చిన్నచూపు చూసే నైజం మొదటి నుంచి ఉందన్నారు. దళితులను నేటికీ గౌరవించని వ్యక్తి చంద్రబాబు అని నారాయణ స్వామి మండిపడ్డారు. నేడు నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ మైదానంలో ‘ఆడుదాం ఆంధ్రా’ కార్యక్రమంను డిప్యూటీ సీఎం ప్రారంభించారు.

‘అప్పుడు ఇద్దరు పీకేలను విమర్శించి.. ఇప్పుడు వాళ్లనే పక్కన పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు అనే డెకాయిట్. చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో ఎలాంటి అభివృధి, సంక్షేమం పాలన అందించ లేదు. ఎస్సీలు అంటే చిన్నచూపు చూసే నైజం చంద్రబాబుకు మొదటి నుంచి ఉంది. బాబు లాంటి అవినీతి వ్యక్తిని నేను చూడలేదు. ప్రశాంత్ కిషోర్, పవన్ కళ్యాణ్ పై అనేక విమర్శలు చేసిన వ్యక్తి చంద్రబాబు. తాను చేసింది చెప్పుకోలేని వ్యక్తి బాబు. పోత్తులతో అధికారంలోకి రావాలని బాబు చూస్తున్నాడు. అభ్యర్థుల మార్పు పార్టీ అంతర్గత విషయం. దళితులను నేటికీ గౌరవించని వ్యక్తి చంద్రబాబు. ఇప్పటికీ గ్రామాల్లో అంటరానితనం పెంచి ప్రోత్సహిస్తున్నారు’ అని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మండిపడ్డారు.

Also Read: Aadudam Andhra: గ్రామాల్లోని ఆణిముత్యాలను దేశానికి అందిస్తాం: సీఎం జగన్

కరోనా గురించి భయపడాల్సిన పనిలేదని, రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాల అప్రమత్తంగా ఉందని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి చెప్పారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రజా ఆరోగ్యంకు పెద్ద పీఠ వేస్తున్నారన్నారు. డిసెంబర్‌ 26 నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు 47 రోజుల పాటు నిర్విరామంగా ‘ఆడుదాం ఆంధ్ర’ పోటీలు జరగనున్నాయి. తొలి దశలో జనవరి 9వ తేదీ నాటికి గ్రామ/వార్డు సచివాలయాల స్థాయిలో పోటీలను పూర్తి చేయనున్నారు. జనవరి 10 నుంచి 23 వరకు మండల స్థాయిలో, జనవరి 24 నుంచి 30 వరకు నియోజకవర్గ స్థాయిలో, జనవరి 31 నుంచి ఫిబ్రవరి 5వ తేదీ వరకు జిల్లా స్థాయిలో, ఫిబ్రవరి 6వ నుంచి 10వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి పోటీలు జరగనున్నాయి.