Petrol Attack: ఆదోనిలో దారుణం.. మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఇద్దరు మహిళలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Woman Attacked With Petrol in Adoni RTC bus stand: కర్నూలు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆదోని ఆర్టీసీ బస్టాండ్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. మహిళ కళ్లలో కారం చల్లి, అనంతరం పెట్రోల్ పోసి నిప్పంటించారు. తీవ్ర గాయాలైన మహిళను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాధితురాలిని నర్సమ్మగా పోలీసులు గుర్తించారు. ఆమె మున్సిపాలిటీలో శానిటేషన్ కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తోంది. విధులు నిర్వహిస్తున్న సమయంలోనే ఈ దాడి జరిగింది.
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. ఇద్దరు గుర్తుతెలియని మహిళలు నర్సమ్మపై దాడి చేశారు. కారం కళ్లలో చల్లిన అనంతరం నర్సమ్మపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. మంటలతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు, సిబ్బంది ఆమెను రక్షించి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స కొనసాగుతోంది. రెండేళ్ల క్రితం నర్సమ్మ భర్త మృతి చెందాడు. అప్పటి నుంచి ఇద్దరు పిల్లలతో కలిసి ఆమె ఒంటరిగా జీవనం సాగిస్తూ.. శానిటేషన్ కాంట్రాక్ట్ ఉద్యోగం ద్వారా కుటుంబాన్ని పోషించుకుంటోంది. విధుల్లో ఉండగా ఆమెపై ఈ దారుణ దాడి జరగడం కుటుంబ సభ్యులను తీవ్ర ఆవేదనకు గురిచేసింది. నర్సమ్మపై దాడి వెనుక అసలు కారణం ఏమిటనే దానిపై ప్రస్తుతం పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఆదోని ఆర్టీసీ బస్టాండ్‌కు చేరుకుని వివరాలు సేకరించారు. ఘటనాస్థలాన్ని పరిశీలించి, అక్కడి పరిస్థితులపై ఆరా తీశారు. బాధితురాలిపై దాడి చేసిన వ్యక్తులు ఎవరు?.. ఎందుకు ఈ దాడికి పాల్పడ్డారు?.. ముందస్తు కక్షలేమైనా ఉన్నాయా? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. బస్టాండ్ పరిసరాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. విధులు నిర్వహిస్తున్న మహిళపై బహిరంగ ప్రదేశంలోనే పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
తాజావార్తలు
-
Petrol Attack: ఆదోనిలో దారుణం.. మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఇద్దరు మహిళలు!
-
Thudakkam OTT Release: విస్మయ మోహన్‌లాల్ తొలి సినిమా ఓటీటీలోకి.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?
-
OnePlus Ace 7 Pro: 200MP కెమెరా, 16GB RAMతో వన్‌ప్లస్ Ace 7 Pro.. ఫీచర్లు లీక్!
-
Maruti Baleno Facelift 2026: కొత్త మారుతి బాలెనో ఫేస్‌లిఫ్ట్ విడుదల.. 1.2L Z-Series ఇంజన్, Level-2 ADAS
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే, పండగే ఇవాళ!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!