టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ నటించిన ‘గూఢచారి’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.స్పై అండ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా 2018లో విడుదలై బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ అందుకొని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు దానికి సీక్వెల్గా ‘G2’ సినిమా తెరకెక్కుతుంది.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ మరియు ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన పోస్టర్స్ మరియు ప్రీ లుక్ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా భారీ అంచనాలను క్రియేట్ చేసింది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఓ ఆసక్తికర అప్డేట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.భారీ బడ్జెట్ తో రూపొందుతున్న అడివి శేష్ ‘G2’ మూవీలో బాలీవుడ్ అగ్ర హీరో ఇమ్రాన్ హష్మీ ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నట్లు తాజా సమాచారం. సినిమాలో ఇమ్రాన్ హష్మీ రోల్ మరింత పవర్ ఫుల్ గా ఉండనున్నట్లు తెలిసింది. ఇప్పటికే బాలీవుడ్ లో ‘టైగర్ 3’ అనే స్పై యాక్షన్ మూవీలో తన విలనిజంతో ఆకట్టుకున్న ఇమ్రాన్ హష్మీ ఇప్పుడు అడివి శేష్ ‘G2’ లో ఇంపార్టెంట్ రోల్ లో కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మూవీ టీం నుంచి దీనిపై ఇంకా అధికారిక సమాచారం రావాల్సి ఉంది.
ఒకవేళ ఇదే నిజమైతే ఇమ్రాన్ హష్మీ ఎంట్రీ తో అడవి శేష్ సినిమాకి బాలీవుడ్ లో మరింత క్రేజ్ దక్కే అవకాశం అయితే ఉంది.బాలీవుడ్ లో రొమాంటిక్ హీరోగా భారీ క్రేజ్ తెచ్చుకున్న ఇమ్రాన్ హష్మీ ఎవరూ ఊహించని విధంగా సల్మాన్ ఖాన్ ‘టైగర్ 3’ సినిమాతో విలన్ గా నటించి మెప్పించారు.. ప్రస్తుతం ఇమ్రాన్ హష్మీ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘OG’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ‘సాహో ‘డైరెక్టర్ సుజిత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా మాఫియా బ్యాక్ డ్రాప్ లో గ్యాంగ్ స్టర్ డ్రామాగా రాబోతోంది. ఈ సినిమాలో కూడ ఇమ్రాన్ హష్మీ పవర్ఫుల్ విలన్ గా కనిపించబోతున్నాడు. ఇప్పటికే 80 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది..ఇదిలా ఉంటే ‘గూడచారి’ సినిమాకి ఎడిటర్ గా పనిచేసిన వినయ్ కుమార్ ఈ సినిమాతో ‘G2’ సినిమాతో వెండితెరకు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. గూడచారి కథ మొత్తం ఇండియాలోనే ఉంటుంది. కానీ ఈ సీక్వెల్లో కథ మొత్తం ఇంటర్నేషనల్ రేంజ్ లో ఉండనుండని సమాచారం.. ఫస్ట్ పార్ట్ లో కనిపించిన కొన్ని పాత్రలతో పాటు మరికొన్ని కొత్త పాత్రలు ఈ సీక్వెల్లో కనిపించనున్నట్లు తెలుస్తుంది.