Adivi Sesh: ‘డెకాయిట్’తో నా రూట్ మారుతోంది.. అడివి శేష్ క్లారిటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ నటించిన మోస్ట్ అవేటెడ్ మూవీ ‘డెకాయిట్’ ఏప్రిల్ 10న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో ‘సీతారామం’ బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. శేష్, మృణాల్ మధ్య వచ్చే కెమిస్ట్రీ సినిమాకు మెయిన్ పిల్లర్ అని తెలుస్తోంది. అలాగే బాలీవుడ్ దిగ్గజం అనురాగ్ కశ్యప్ ఈ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతుండటం మరో విశేషం. షానీల్ డియో దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం అడివి శేష్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా జరిగిన #AskSesh సెషన్‌లో శేష్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
Also Read : Divya Dutta: 20 సినిమాల అడ్వాన్స్ కోట్లలో వెనక్కి.. డబ్బు కంటే పేరే ముఖ్యం అంటున్న స్టార్ నటి..
Also Read
ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్ చిత్రీకరణ కోసం చిత్ర యూనిట్ పడిన కష్టాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.. ‘డెకాయిట్ క్లైమ్యాక్స్ సీన్లను సుమారు 45 డిగ్రీల మండే ఎండలో, ఒక పర్వతంపై చిత్రీకరించాం. ఆ వేడిలో యాక్షన్ సీక్వెన్స్ చేయడం చాలా సవాలుగా అనిపించింది’ అని శేష్ పేర్కొన్నారు. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, విజువల్స్ పరంగా కూడా ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అలాగే ఓ నెటిజన్ ఎప్పుడూ థ్రిల్లర్ సినిమాలే చేస్తారా? అనే ప్రశ్నకు శేష్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు.. ‘థ్రిల్లర్ జోనర్ నుండి నేను ఎప్పుడు బయటకు వస్తానని చాలామంది అడుగుతున్నారు. ‘డెకాయిట్’ సినిమాతోనే ఆ మార్పు మొదలవుతుంది. ఇది కేవలం యాక్షన్ మాత్రమే కాదు, ఒక అందమైన రొమాంటిక్ ఎమోషనల్ జర్నీ’ అని ఆయన స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!