ప్రపంచవ్యాప్తంగా జూన్ 16 న ఎంతో గ్రాండ్ గా విడుదలైంది ఆదిపురుష్ సినిమా.సినిమా పై మొదటి నుంచి నెగటివ్ టాక్ రావడంతో సినిమాకు ఆశించన ఫలితం రాలేదు.. సినిమా పై వరుసగా వస్తున్న విమర్శలు వల్ల కూడా కలెక్షన్లపై ప్రభావం పడింది.రోజురోజుకూ కలెక్షన్లు దారుణంగా పడిపోతుండటంతో చిత్ర యూనిట్ కీలక నిర్ణయం తీసుకుందని తెలుస్తుంది.ఆదిపురుష్ సినిమా విడుదలైన మొదటి మూడ్రోజులు అడ్వాన్స్ బుకింగ్స్ ప్రభావంతో సుమారు 250 కోట్ల వరకూ బిజినెస్ చేసి భారీ రికార్డు సృష్టించింది. ఈ రేంజ్ లోనే కలెక్షన్స్ వస్తాయని అందరూ కూడా ఆశించారు. అయితే విడుదలైన నాలుగవరోజు నుంచి రోజురోజుకూ కలెక్షన్లు దారుణంగా పడిపోతూ వచ్చాయి. ఎంతలా అంటే ఇప్పటి వరకూ ఈ సినిమా కేవలం 363 కోట్లే గ్రాస్ కలెక్షన్లు మాత్రమే చేయగలిగింది.ఆదిపురుష్ బాక్సాఫీసు వద్ద ఆశించిన స్థాయిలో ఫలితం సాధించలేకపోయింది. సినిమా విడుదలైన నాలుగోరోజు నుంచే కలెక్షన్లు గణనీయంగా తగ్గిపోవడం జరిగింది.. మొదటి రోజు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి 32 కోట్ల షేర్ కలెక్షన్లు వసూలు చేసిన సినిమా 7వ రోజుకు 97 లక్షల షేర్ ను మాత్రమే కలెక్ట్ చేసింది.. ఇక 8వ రోజుకు అయితే కేవలం 65 లక్షల షేర్ మాత్రమే వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు 363 కోట్ల గ్రాస్ కలెక్షన్లు మాత్రమే వచ్చాయి..
దాంతో ఆదిపురుష్ సినిమా టికెట్లను ధర ను తగ్గిస్తూ చిత్ర నిర్మాతలు నిర్ణయం తీసుకోవడం జరిగింది.రేపట్నించి 3డిలో ఈ సినిమాను కేవలం 112 రూపాయలకే చూడవచ్చని టీ సిరీస్ ప్రకటించింది. సినిమాలోని డైలాగ్స్‌పై అభ్యంతరాలు కూడా రావడంతో వాటిని కూడా మార్చినట్టు కూడా టీ సిరీస్ వెల్లడించింది. మార్పులు చేసిన డైలాగ్స్ రేపటి నుండి ప్రదర్శిస్తామని తెలిపింది.ప్రభాస్ కెరీర్ లో రాధేశ్యామ్ తరువాత వచ్చిన ఈ సినిమా కూడా అంతగా ఆకట్టుకోకపోవడం తో ప్రభాస్ అభిమానులు తీవ్ర నిరాశ లో ఉన్నారు. ప్రభాస్ అభిమానులు ఆయన తరువాత సినిమా సలార్‌పైనే భారీగా ఆశలు పెట్టుకున్నారు.