Site icon NTV Telugu

Teacher Murder: ఆదిలాబాద్ టీచర్ హత్యకేసు.. వెలుగులోకి సంచలన విషయాలు!

Btesh Student Manoj Dead

Btesh Student Manoj Dead

Adilabad Teacher Murder Update: ఆదిలాబాద్ జిల్లాలోని గాదిగూడ మండ‌లం ప‌ర్సువాడ వ‌ద్ద జూన్ 12న ప్ర‌భుత్వ ఉపాధ్యాయుడు గ‌జేంద‌ర్‌ను గుర్తు తెలియ‌ని దుండ‌గులు అత్యంత దారుణంగా హ‌త్య చేసిన ఘటన కలకలం రేపింది. గ‌జేంద‌ర్‌ స్వ‌స్థ‌లం నార్నూర్ మండ‌లం నాగుల‌కొండ‌ కాగా.. జైన‌థ్ మండ‌లం కెనాల్ మేడిగూడ‌లో టీచ‌ర్‌గా ప‌ని చేస్తున్నారు. కుటుంబకలహాల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లు పోలీసులు అనుమానించారు. గ‌జేంద‌ర్‌ హ‌త్యపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేసిన పోలీసులకు సంచలన విషయాలు తెలిశాయి.

Also Read: South Africa Record: ఒకటి, రెండు కాదు.. ఏకంగా ఐదు సార్లు ఒక్క పరుగుతో గట్టెక్కిన దక్షిణాఫ్రికా!

గ‌జేంద‌ర్‌ మరణంపై అతడి భార్యను అదుపులోకి తీసుకోని పోలీసులు విచారించారు. మృతుడి భార్యతో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. గ‌జేంద‌ర్‌ భార్య.. ప్రియుడితో కలసి తన భర్త మర్దర్ స్కెచ్ వేసినట్టుగా పోలీసులు ఆధారాలు సేకరించారు. స్కూల్స్ రీఓపెన్ రోజున గజానంద్‌ను చంపాలని ప్లాన్ చేశారు. గ‌జేంద‌ర్‌ భార్య ప్రియుడుతో పాటు మరో ఇద్దరు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. ఈరోజు మధ్యాహ్నం మీడియా సమావేశంలో పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. సోషల్ మీడియాలో ఫొటోలు, ఆడియో వైరల్ అయ్యాయి.

Exit mobile version