NTV Telugu Site icon

Kerala Minister: ఆదిశంకరాచార్యులు క్రూరమైన కుల వ్యవస్థను సమర్థించారు.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

Kerala Minister

Kerala Minister

Kerala Minister: ఆదిశంకరాచార్యపై కేరళ మంత్రి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. హిందూ వైదిక తత్వవేత్త ఆదిశంకరాచార్య క్రూరమైన కుల వ్యవస్థకు చెందిన న్యాయవాది, ప్రతినిధి అంటూ కేరళ మంత్రి, కమ్యూనిస్ట్‌ నాయకుడు ఎంబీ రాజేష్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శంకరాచార్య, నారాయణ గురుదేవుల మధ్య సమాంతరాన్ని మంత్రి వివరించారు. నారాయణ గురుదేవులు శంకరాచార్యను విమర్శించారని.. నారాయణ గురుదేవులే కేరళలో ‘ఆచార్య’ అని అన్నారు.

వర్కాల శివగిరి మఠంలో జరిగిన కార్యక్రమంలో రాజేష్ మాట్లాడుతూ.. కేరళకు ఆచార్యులుంటే అది శ్రీనారాయణ గురువే తప్ప ఆదిశంకరాచార్యులు కాదని, శంకరాచార్యులు మనుస్మృతిపై ఆధారపడిన క్రూరమైన కులవ్యవస్థను సమర్థించారన్నారు. శ్రీనారాయణ గురువే మనుస్మృతిని పారద్రోలేందుకు కృషి చేశారని అన్నారు. శంకరాచార్య కుల వ్యవస్థను సమర్ధించడమే కాకుండా దానికి ప్రతినిధిగా కూడా ఉన్నారని ఆయన అన్నారు. కుల వ్యవస్థను సమర్ధించిన శంకరాచార్యపై శ్రీనారాయణ గురు విమర్శలు చేశారని రాజేష్ అన్నారు. సమాజంలో కుల వ్యవస్థ వేళ్లూనుకుపోవడానికి శంకరాచార్యులే కారణమని మంత్రి అన్నారు.

Bharat Jodo Yatra: 3వేల కిలోమీటర్లు పూర్తి.. నేడు యూపీలో పునఃప్రారంభం

“శంకరాచార్యుల తర్వాత శ్రీనారాయణ గురువే అని ఇప్పుడు కొన్ని వ్యాఖ్యానాలు ఉన్నాయి. కాదు, శంకరాచార్యను విమర్శించిన వ్యక్తి గురువే. కుల వ్యవస్థ ప్రజలను కబళించిందని, దానికి శంకరాచార్యులు కూడా కారణమని శ్రీనారాయణ గురువే చెప్పారు” అని ఆయన పేర్కొన్నారు. ఇదిలావుండగా, ఆదిశంకరాచార్య, శ్రీ నారాయణ గురుదేవులు ఒకే భారతీయ వంశానికి చెందిన వారని, ఒకే దృష్టిని ముందుకు తెచ్చారని భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంబీ రాజేష్ హిందూమతంలో చీలిక తెచ్చేందుకు ప్రయత్నించారని మురళీధరన్ అన్నారు.

Show comments