Site icon NTV Telugu

Shambala : ఓటీటీలోకి వచ్చేసిన ఆది ‘శంబాల’.. కానీ ఆ యూజర్లకు మాత్రమే!

Shambala Movie

Shambala Movie

టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు గతేడాది చివర్లో వచ్చిన ‘శంబాల’ (Shambala) సినిమాతో ఆది సాలిడ్ హిట్ అందుకున్నాడు. దర్శకుడు యుగంధర్ ముని ఈ చిత్రాన్ని అద్భుతమైన సస్పెన్స్‌తో మలిచారు. ఒక పురాతన ఆలయం చుట్టూ తిరిగే మిస్టరీ, ఆధ్యాత్మిక అంశాలు.. ఆది సాయికుమార్ నటన ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఆది కెరీర్‌లో ఇది ఒక విభిన్నమైన చిత్రమని చెప్పొచ్చు. డిసెంబర్‌లో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టడమే కాకుండా, విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఒక ఇంట్రెస్టింగ్ డివోషనల్ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా, ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని అందించింది. ఇక థియేటర్లలో ఈ మిస్టరీని మిస్ అయిన వారి కోసం ‘శంబాల’ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.

Also Read : Nidhi Agerwal : ఇండస్ట్రీ నెగిటివ్ క్యాంపెయిన్‌పై.. నిధి అగర్వాల్ షాకింగ్ కామెంట్స్!

ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’ (Aha) భారీ ధరకు సొంతం చేసుకుంది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా ఈ రోజు నుంచే ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇందులో ఒక చిన్న కండిషన్ ఉంది. ప్రస్తుతం ఈ సినిమా కేవలం ‘ఆహా గోల్డ్’ (Aha Gold) సబ్‌స్క్రైబర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. అంటే మీరు గోల్డ్ మెంబర్‌షిప్ కలిగి ఉంటే ఇప్పుడే ఈ సినిమాను చూసేయొచ్చు. ఇక రెగ్యులర్ సబ్‌స్క్రైబర్లు మాత్రం మరో 24 గంటలు వేచి చూడాల్సి ఉంటుంది, వీరికి రేపటి నుండి ఈ సినిమా అందుబాటులోకి వస్తుంది. థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి ‘శంబాల’ ఒక పర్ఫెక్ట్ ఛాయిస్. మీరు గనుక ఆహా గోల్డ్ యూజర్ అయితే, వెంటనే ఈ అదిరిపోయే డివోషనల్ థ్రిల్లర్‌ను వీక్షించండి.

Exit mobile version