టాలీవుడ్‌లో ఎప్పటి నుండో హిట్ కోసం తాపత్రేయపడుతున్న హీరోలో ఆది సాయికుమార్ ఒకరు. దీంతో కొంత గ్యాప్ ఇచ్చిన ఆది చాలా కాలం తర్వాత ఒక పవర్‌ఫుల్ సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ ‘శంబాల’ (Shambhala) తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన నటించిన ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. యుగంధర్ ముని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఆది ‘జియో సైంటిస్ట్’గా కనిపిస్తుండగా, అర్చన అయ్యర్ కథానాయికగా నటిస్తోంది. శ్రీచరణ్ పాకాల అందించిన నేపథ్య సంగీతం, టీజర్ మరియు ట్రైలర్ ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి.
Also Read : Lenin : ‘లెనిన్’ షూటింగ్ పూర్తి చేసిన అఖిల్.. కానీ?
ఈ చిత్రానికి ప్రభాస్, నాని వంటి స్టార్ హీరోలు మద్దతు తెలపడం విశేషం. రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం విజువల్ వండర్‌గా ఉంటుందని, ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని సరికొత్త పాయింట్‌తో రాబోతోందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఆది తన తండ్రి సాయి కుమార్ గురించి చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆకట్టుకున్నాయి.. ‘మా నాన్న తన సినీ జీవితంలో ఎన్నో గొప్ప విజయాలు చూశారు. అయినప్పటికీ, నా కెరీర్ గురించి ఆయన ఇంకా టెన్షన్ పడుతూనే ఉంటారు. నాకు ఒక మంచి సాలిడ్ హిట్ పడితే తప్ప ఆయన మనసు ప్రశాంతంగా ఉండదు. ఈ సినిమాతో ఆ టెన్షన్ పోతుందని నమ్ముతున్నాను’ అంటూ ఆది ఎమోషనల్‌గా మాట్లాడారు.
