తెలంగాణలో బదిలీల పర్వం కొనసాగుతోంది. తెలంగాణ పోలీసు శాఖలో బదిలీలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే భారీగా డీఎస్పీలు, ఏఎస్పీలను బదిలీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో 12 మంది అడిషనల్ ఎస్పీలకు స్థానచలనం కలిగించింది. ఈ మేరకు డీజీపీ రవిగుప్తా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం.. నిజామాబాద్ అడిషనల్ డీసీపీగా ఎస్ రమేశ్, ఆదిలాబాద్ అడిషనల్ ఎస్పీగా సురేందర్ రావు, హైదరాబాద్ ట్రాఫిక్-3 అడిషనల్ డీసీపీగా రామారావు, సైబరాబాద్ క్రైమ్ అడిషనల్ డీసీపీగా శ్రీనివాసులు, మెదక్ అడిషనల్ ఎస్పీగా రెహ్మాన్, నిర్మల్ అడిషనల్ ఎస్పీగా శివకుమార్ నియమితులయ్యారు. బుధవారం హైదరాబాద్‌తో పాటు వివిధ జిల్లాల్లో కొనసాగుతున్న డీఎస్పీలను, ఏసీపీలను బదిలీ చేశారు. రానున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో పోలీస్ అధికారులను బదిలీ చేశారు. మూడేళ్లుగా ఒకేచోట పని చేస్తోన్న, సొంత జిల్లాల్లో పని చేస్తోన్న అధికారులను బదిలీ చేయాలని ఎన్నికల కమిషన్ గత డిసెంబర్‌లో ఆదేశించింది. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రభుత్వం అధికారులను బదిలీ చేసినట్లు తెలుస్తోంది.
ASP’s Transfer : తెలంగాణలో 12 మంది ఏఎస్పీల బదిలీ..

Ts Logo