NTV Telugu Site icon

Addanki Dayakar Rao : బండి వ్యాఖ్యలపై అద్దంకి దయాకర్‌ ఫైర్‌

Addanki Dayakar

Addanki Dayakar

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై కన్నెత్తి చూసే పార్టీల పతనం ప్రజలు చూసుకుంటారని వ్యాఖ్యానించారు అద్దంకి దయాకర్. ఇవాళ
ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బండి సంజయ్ వ్యాఖ్యలు కాంగ్రెస్ ని అలెర్ట్ చేసినట్టు చెప్తున్నారని, బీఆర్‌ఎస్‌.. బీజేపీ మధ్య ఉన్న అనైతిక
రహస్యమైత్రి తెలియదు అనుకోకండని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలే బీఆర్‌ఎస్‌ వైపు వెళ్తారు అనే మాటలు
చెప్పడం సరికాదని అద్దంకి దయాకర్‌ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంని కూల్చాలని అనుకుంటే ఇటువైపు నుండి అంతకంటే ఎక్కువ
వ్యూహాలు ఉన్నాయని అద్దంకి దయాకర్‌ వ్యాఖ్యానించారు.

 

ఇదిలా ఉంటే.. ఏఐసీసీతో టీపీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి తుది విడత చర్చలు జరిపిన నేపథ్యంలో ఎమ్మెల్యే కోటా కింద
జనవరి 29న జరగనున్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ ఒకటి, రెండు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. ఈ
సమావేశంలో ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ, తెలంగాణ ఇన్‌ఛార్జ్, సీనియర్ కాంగ్రెస్ నేత దీపాదాస్ మున్షీ కూడా పాల్గొన్నారు. సీనియర్
కాంగ్రెస్ నాయకుడు జి చిన్నారెడ్డి, మాజీ ఎమ్మెల్యే & కొత్తగా ఏర్పాటు చేసిన ధరణి కమిటీ సభ్యుడు ఎం కోదండ రెడ్డి, పీసీసీ సీనియర్ వైస్
ప్రెసిడెంట్ జాఫర్ జావేద్, సూర్యాపేటకు చెందిన నాయకుడు, పటేల్ రమేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, వేం నరేందర్ రెడ్డి, అలీ బిన్ ఇబ్రహీం
మస్కతీ, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రెండు ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ పడుతున్న వారిలో బి మహేష్ కుమార్ గౌడ్, పీసీసీ ప్రధాన కార్యదర్శి
అద్దంకి దయాకర్, పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జి నిరంజన్ ఉన్నారు.

Show comments