Addanki Dayakar : బీఆర్ఎస్‌కు అసెంబ్లీలో ఏ అంశాలు ఎత్తుకోవాలని తెలవడం లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీఆర్ఎస్ వాదన మేము దొంగతనం చేస్తాం కానీ మమ్మల్ని ఎవరు అడుకోవద్దు అనేలా వాదన ఉందని టీపీసీసి అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏ కమిషన్ వేసినా కమిషన్ ను ప్రశ్నించడం ఎదురు దాడి చేయడం అలవాటుగా మారిందని, హైకోర్టు చెప్పినట్టు విందామన్నారు. ఏ కమిషన్ వేసినా దానికి సమాధానం చెబుతామని టిఆర్ఎస్ నేతలు అన్నారని, అలాంటప్పుడు ఎందుకు హైకోర్టును ఆశ్రయిస్తున్నరు. ఎందుకు వ్యతిరేకిస్తున్నారన్నారు. మీ నాయకుడిని హౌస్ కి రమ్మంటే రాడు. ప్రతి అంశం హౌస్ లోనే చర్చిస్తామని ఆయన పేర్కొన్నారు. చత్తీస్గడ్ ఒప్పందాల పైన కూడా అసెంబ్లీలో చర్చిస్తామని, బీఆర్ఎస్‌కు అసెంబ్లీలో ఏ అంశాలు ఎత్తుకోవాలని తెలవడం లేదన్నారు అద్దంకి దయాకర్. రైతు రుణమాఫీని రాజశేఖర్ రెడ్డి తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ చేసిందని, ఆ తర్వాత వచ్చిన ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేకపోయారన్నారు. దీనిపై కూడా విమర్శలు చేస్తున్నారని, బీఆర్ఎస్ అజెండాతో ఏందో ఫిక్స్ చేసుకోండని ఆయన తెలిపారు.
అంతేకాకుండా..’ఫ్రీ బస్ మంచిగా లేదంటారు. ఆటో వాళ్ళను ఎగేస్తున్నారు. ఫ్రీ బస్సు ఉండదని అబద్ధాలు చెబుతున్నరు.. ప్రభుత్వ పథకాలను సలహాలు సూచనలు ఇవ్వండి. కేసీఆర్ ప్రతి పథకంలో ప్రథమ ముద్దాయిగా ఉన్నడు.. ప్రతి అంశం పైన కేసీఆర్ పేరు చర్చకు ఎందుకు వస్తుందో తెలుసుకోవాలి. మేము పారదర్శంగా పనిచేస్తున్నము. గత బీఆర్ఎస్ సర్కార్ లో 25% రాష్ట్రంలో అక్రమాలు జరిగాయి. కాలేశ్వరం ప్రాజెక్టు అవినీతి వల్ల నీళ్లు లేక మన రైతులు ఇబ్బంది పడుతున్నరు. కమిషన్లను తప్పుపట్టడం విచారణ తప్పుపట్టడం బీఆర్ఎస్ మానుకోవాలి. జాబ్ క్యాలండర్ ను ప్రిపేర్ చేస్తున్నాం.. ప్రభుత్వాన్ని అబాసు పాలు చేసే వాళ్ళ ట్రాఫిక్ లో నిరుద్యోగులు పడొద్దు… సామాన్యుడు చెబితే కూడా కాంగ్రెస్ వింటది… కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన నిధులను తీసుకురాలేకపోయింది గత ప్రభుత్వం… ఇంకా ప్రభుత్వంలో ఉన్నట్లు భ్రమ పడకండి… గత ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థ కేంద్రం అయిపోయింది… అయినా ఇచ్చిన అన్ని గ్యారెంటీలను కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుంది… గత ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని ప్రజలు దృష్టికి తీసుకెళ్తాం…’ అని అద్దండి దయాకర్ అన్నారు.
Also Read
- RBI: ఆర్బీఐ షాక్ ఇవ్వబోతుందా? రేపు వడ్డీ రేట్లు పెరగబోతున్నాయా? నిపుణుల అంచనా ఇదే!
- Central Cabinet Decision: SME వృద్ధి నిధికి రూ.10వేల కోట్లు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
- BJP: 13 కోట్ల ఓటర్ల లెక్క ఇదే.. ఫేక్ ఓటర్లకు సపోర్ట్ ఎందుకు? కాంగ్రెస్‌కు బీజేపీ ప్రశ్నలు..
- Vivek Bhagat: ‘‘నా ప్రమోషన్ ఆపండి’’.. ఢిల్లీ పోలీస్ అధికారి వివేక్ భగత్
తాజావార్తలు
-
RBI: ఆర్బీఐ షాక్ ఇవ్వబోతుందా? రేపు వడ్డీ రేట్లు పెరగబోతున్నాయా? నిపుణుల అంచనా ఇదే!
-
Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
-
Asaduddin Owaisi : ఓట్ల తొలగింపుపై ఒవైసీ ఫైర్.. సెక్రటేరియట్లో కీలక డిమాండ్లు
-
Central Cabinet Decision: SME వృద్ధి నిధికి రూ.10వేల కోట్లు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
-
BJP: 13 కోట్ల ఓటర్ల లెక్క ఇదే.. ఫేక్ ఓటర్లకు సపోర్ట్ ఎందుకు? కాంగ్రెస్‌కు బీజేపీ ప్రశ్నలు..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!