NTV Telugu Site icon

JaggaReddy: ఎమ్మెల్సీ అభ్యర్డుల బీఫార్మ్ లపై సంతకం చేసిన పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి

Jaggareddy

Jaggareddy

JaggaReddy: తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ రేపటితో (18) ముగియనుంది. రెండు స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అద్దంకి దయాకర్, బల్మూర్ వెంకట్ పేర్లను ప్రకటించింది. వారికి ఇచ్చిన ఫారాలపై వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంతకం చేశారు. పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో ఉన్నందున జగ్గారెడ్డికి ఈ బాధ్యతలు అప్పగించారు.

ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్ ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట నర్సింగరావు పేరు తెరపైకి వచ్చింది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పేరు దాదాపు ఖరారైందని ప్రచారం జరిగినా.. నిన్న (మంగళవారం) మాత్రం అనూహ్యంగా వెంకట్ రేసులోకి దిగారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్‌తో పాటు వెంకట్‌ను రెండో ఎమ్మెల్సీ అభ్యర్థిగా పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది. దీనికి సంబంధించి నిన్న మధ్యాహ్నం నుంచి ప్రచారం జరిగినా అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అయితే వారిద్దరికీ ఏఐసీసీ నుంచి వ్యక్తిగత సమాచారం అందిందని, నామినేషన్లు సిద్ధం చేయాలని ఆదేశించినట్లు తెలిసింది. ఈ నెల 18న నామినేషన్లు దాఖలు చేయనున్న నేపథ్యంలో ఏ క్షణమైనా ఏఐసీసీ ఈ ఇద్దరి పేర్లను అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి మంగళవారం నాడు ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ అనివార్య కారణాల వల్ల ఆలస్యమైందని, బుధవారం అధికారిక ప్రకటన వెలువడుతుందని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి.

Read also: Konaseema Coconut Bonds: నేడు అయోధ్యకు మండపేట ‘కల్యాణ’ కొబ్బరి బోండాలు

జగ్గారెడ్డికి బి ఫారంలపై సంతకం అధికారం..

నామినేషన్ల దాఖలు, ఎమ్మెల్యేల ప్రతిపాదిత సంతకాల వ్యవహారాలను సమన్వయం చేసే బాధ్యతలను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు అప్పగించినట్లు సమాచారం. కాంగ్రెస్ అధిష్టానం ఎన్నుకున్న తర్వాత అత్యంత చిన్న వయస్సున్న అభ్యర్థిగా బల్మూరి వెంకట్ రికార్డు సృష్టించనున్నారు. దేశంలోనే అత్యంత పిన్న వయస్కుడిగా శాసనమండలికి ఎన్నికైన వ్యక్తిగా గుర్తింపు పొందనున్నారు. ప్రస్తుతం వెంకట్ వయసు 30 ఏళ్ల 9 నెలలు. ఇప్పటివరకు, అతను 33 సంవత్సరాల వయస్సులో గుజరాత్ శాసనమండలికి ఎన్నికయ్యాడు, ఇప్పుడు వెంకట్ ఆ రికార్డును అధిగమిస్తాడని గం«దీభవన్ వర్గాలు తెలిపాయి.
Health Tips : చలికాలంలో లవంగాలు తింటే ఏమౌతుందో తెలుసా?