NTV Telugu Site icon

HIT 2: భయం, సస్పెన్స్.. డబుల్ హిట్ గ్యారెంటీ

New Project (21)

New Project (21)

HIT 2: సెలక్టివ్‎గా సినిమాలు చేసుకుంటూ సక్సెస్ సాధిస్తున్న హీరో అడవి శేషు తాజాగా హిట్2 ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నాని నిర్మాతగా శైలేష్ కొలను దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా గతంలో వచ్చిన హిట్ సినిమా విజయవంతమైంది. ఈ సినిమాకి సీక్వెల్స్ ఉంటుందని చిత్రబృందం అప్పుడే ప్రకటించింది. హిట్ సెకండ్ కేస్ లో అడివి శేష్ నటిస్తున్నాడు. మీనాక్షి చౌదరి, కోమలీ ప్రసాద్ హీరోయిన్స్ గా చేస్తున్నారు.

Read Also:Raj Tarun: ‘అహ నా పెళ్లంట’ అంటున్న రాజ్ తరుణ్ కానీ పెళ్లికూతురేమో..

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ఈ సినిమాని డిసెంబర్ 2న రిలీజ్ చేయనున్నారు. హిట్2 టీజర్ ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ టీజర్ లో అడవి శేష్ క్యారెక్టర్ గురించే ఎక్కువగా చూపించారు. కేసు మొదలు పెట్టకు ముందు అడివి శేష్ ఇంట్రో, అడివి శేష్ ఎలా ఉంటాడో చూపించారు. ఒక అమ్మాయి మర్డర్ తో సెకండ్ కేస్ మొదలవుతుందని చెప్పారు కానీ ఎలాంటి సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలు టీజర్ లో చూపించలేదు. చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో చెప్తున్న దాని బట్టి, టీజర్ లో కూడా ఏమి చూపించకుండా సినిమాలోనే చూసుకోండి అన్నట్టు లీడ్ ఇచ్చి వదిలేశారు. దీంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

 

Show comments