NTV Telugu Site icon

Bastar: The Naxal Story OTT: ఓటీటీలో ఆదాశర్మ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Naxals

Naxals

టాలీవుడ్ ముద్దుగుమ్మ ఆదా శర్మ గురించి అందరికి తెలుసు.. గతంలో వచ్చిన సినిమాలు అమ్మడుకు అంతగా పేరును తీసుకురాలేదు.. గత ఏడాది వచ్చిన ది కేరళ స్టోరీ సినిమాతో బాగా పాపులర్ అయ్యింది.. ఆ సినిమాతో దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.. విడుదలకు ముందే ఎన్నో వివాదాలను అందుకుంది.. విడుదలయ్యాక విమర్శకుల ప్రశంసలు అందుకుంది.. అదే తరహాలో మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది..

‘బస్తర్ ది నక్సల్ స్టోరీ ‘ సినిమాతో ఆడియన్స్ ను పలకరించింది ఈ మూవీలో ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన నక్సల్స్ పోరాటాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపించేశారు. ఆ సినిమా కూడా ఎన్నో వివాదాలను అందుకుంది. మొదటి షో తో కొన్ని చోట్ల నెగిటివ్ టాక్ ను అందుకున్నా కూడా మంచి కలెక్షన్స్ ను అందుకుంది.. ఇక ఇప్పుడు ఆ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కు రెడీ అవుతుంది..

ఈ మూవీ మే 17న తేదీన జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని నేడు (మే 8) సోషల్ మీడియాలో జీ5 అధికారికంగా ప్రకటించింది. హిందీతో పాటు తెలుగులోనూ మే 17న ఈ సినిమా స్ట్రీమింగ్‍కు వస్తుందని వెల్లడించింది.. తెలుగులో కూడా అదే రోజు స్ట్రీమింగ్ అవుతుందని జీ5 ప్రకటించింది. ఇక్కడ ఆకట్టుకున్న సినిమా అక్కడ ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి..