Site icon NTV Telugu

Rishabh Pant: పంత్ పై మండి పడ్డ ఆడం గిల్‌క్రిస్ట్‌.. అసలు మ్యాటరేంటంటే..?!

7

7

ఐపీఎల్ సీజన్ లో భాగంగా శుక్రవారం నాడు జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్‌ పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక ఈ సీజన్ లో హ్యాట్రిక్ ఓటముల నుంచి తప్పించుకుని లక్నోకు చెక్ పెట్టి తిరిగి గెలుపు బాట పట్టింది ఢిల్లీ క్యాపిటల్స్. ఇక ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో జయింట్స్ ఏడు వికెట్లను కోల్పోయి 167 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ ఇన్నింగ్స్ లో ఆయుష్ బదోని 35 బంతుల్లో 55 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇక కెప్టెన్ కేఎల్ రాహుల్ 22 బంతుల్లో 39 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు.

Also Read: Rishabh Pant: ఆ విషయంలో రికార్డ్ సృష్టించిన రిషబ్ పంత్..!

ఇక ఈ ఇన్నింగ్స్ లో ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ అంపైర్‌ తో కాస్త దురుసుగా ప్రవర్తించాడు. వైడ్‌ కు సంబంధించి రివ్యూ విషయంలో ఫీల్డ్‌ అంపైర్‌ తో చాలాసేపు పంత్ వాగ్వాదానికి దిగాడు. ఇక చివరకి తప్పు తనదే అని తేలడంతో ఎం మాట్లాడకుండా ఉండిపోయాడు. ఇక లక్నో ఇన్నింగ్స్‌లో నాలుగో ఓవర్‌ జరుగుతున్నపుడు ఈ ఘటన జరగింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అవుతున్నాయి.

Also Read: Sai Pallavi: వామ్మో.. సాయి పల్లవి రెమ్యూనరేషన్ ఒక్కసారిగా అంతపెంచిందా..?!

ఈ విషయం సంబంధించి ఆస్ట్రేలియా దిగ్గజ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ఆడం గిల్‌క్రిస్ట్‌ రిషభ్‌ పంత్‌ తీరుపై మండిపడ్డాడు. అంపైర్‌ తో దురుసుగా ప్రవర్తించిన తీరుపై పంత్‌ లాంటి ఆటగాళ్లను కచ్చితంగా పనిష్‌ చేయాలంటూ విజ్ఞప్తి చేశాడు.

Exit mobile version