Adam Gilchrist on MS Dhoni: ప్రపంచ క్రికెట్ చరిత్రలో బెస్ట్ వికెట్ కీపర్‌లలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ టాప్‌లో ఉంటాడు. వికెట్ల వెనుక చురుగ్గా ఉండటం, రెప్పపాటులో స్టంపింగ్ చేయడం మహీ ప్రత్యేకత. ధోనీ వికెట్ల వెనకాల ఉన్నాడంటే.. బ్యాటర్‌కు క్రీజు బయట అడుగు వేయాలనే ఆలోచనే రాదు. మహీ కీపింగ్‌లో అత్యంత డేంజరస్ నానుడి. అలాంటి ధోనీకి ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ రెండో స్థానం ఇచ్చాడు. బెస్ట్ వికెట్ కీపర్ అయిన గిల్లీ.. తాజాగా తన టాప్-3 బెస్ట్ వికెట్ కీపర్ల జాబితాను వెల్లడించాడు.
బెస్ట్ వికెట్ కీపర్ జాబితాలో ఆడమ్ గిల్‌క్రిస్ట్ తన రోల్ మోడల్, ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ రాడ్నీ మార్ష్‌ను ఎంచుకున్నాడు. 2022లో మరణించిన రాడ్నీ.. ఆసీస్ తరఫున 1970-84 మధ్య 96 టెస్టులు, 92 వన్డేలు ఆడాడు. 96 టెస్టుల్లో 355 అవుట్‌లతో ప్రపంచ రికార్డు సృష్టించాడు. రెండో స్థానంలో ఎంఎస్ ధోనీని తీసుకున్న గిల్లీ.. మూడో స్థానంలో శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కరను ఎంపిక చేశాడు. మహీ భారత్ తరఫున 90 టెస్టులు, 350 వన్డేలు, 98 టీ20లు ఆడాడు. లంక తరపున సంగా 134 టెస్టులు, 404 వన్డేలు, 56 టీ20లు ఆడాడు.
Also Read: Casting Couch: తమిళ చిత్ర పరిశ్రమలోనూ కాస్టింగ్ కౌచ్.. నేను చేదు సంఘటనలు ఎదుర్కొన్నా: హీరోయిన్
టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాడ్నీ మార్ష్‌ను తన ఆరాధ్యదైవం అని ఆడమ్ గిల్‌క్రిస్ట్ అభివర్ణించాడు. ‘రాడ్నీ మార్షల్ నాకు మార్గదర్శి. ఆయనలా కావాలని నేను ఎప్పుడూ అనుకొనేవాడిని. ఎంఎస్ ధోనీ కూల్‌నెస్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉంటూ తన పని చేసుకుంటూ వెళ్ళాడు. కుమార సంగక్కర క్లాసిక్ ప్లేయర్. బ్యాటింగ్‌లో ముందొచ్చి ఆడటమే కాకుండా కీపింగ్ నైపుణ్యాలు అద్భుతం’ అని గిల్‌క్రిస్ట్ చెప్పుకొచ్చాడు.
