Site icon NTV Telugu

IPL 2025: ఆర్సీబీపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ సంచలనం..

Rcb

Rcb

రేపటి నుంచి ఐపీఎల్ మహా సంగ్రామం ప్రారంభం కాబోతుంది. ఈ పండగ కోసం భారత్ అభిమానులే కాకుండా.. అన్ని దేశాల క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అభిమానులతో పాటు క్రికెట్ దిగ్గజాలు కూడా ఐపీఎల్ కోసం చూస్తున్నారు. కాగా.. రేపు ప్రారంభ మ్యాచ్ కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో జరగనుంది. కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది.

Read Also: IPL 2025: ఐపీఎల్ ప్రారంభానికి ముందు ఆ జట్టుకు భారీ షాక్..

ఈ క్రమంలో.. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ పాయింట్ల పట్టికలో ఆర్సీబీ ఈసారి అట్టడుగున నిలుస్తుందని జోస్యం చెప్పారు. ఆర్సీబీ అంటే తనకేమీ ద్వేషం లేదని.. కోహ్లీకి కూడా తానెప్పుడూ వ్యతిరేకం కాదన్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో ఇంగ్లండ్ ఆటగాళ్లు ఎక్కువగా ఉన్నారు.. వారి వల్ల ఆ జట్టుకు పెద్దగా ఒరిగేదేమీ ఉందని తెలిపారు. అందేకే టేబుల్‌లో పదో స్థానంలో నిలిచే అర్హతలు ఈ జట్టుకే ఎక్కువగా ఉన్నాయని గిల్‌క్రిస్ట్ చెప్పుకొచ్చారు.

Read Also: RC 16: చరణ్ బర్త్‌డే స్పెషల్ రెడీ అవుతోంది!

Exit mobile version