Sunaina : ప్రముఖ కోలీవుడ్ నటిమనులలో ఒకరైన సునయన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తమిళం, తెలుగు, మలయాళం సినిమాలలో వరుసగా సినిమా అవకాశలను దక్కించుకుంటూ అనేక భారీ విజయాలను కూడా సొంతం చేసుకుంది. ఈ మధ్య కాలంలో ఆవిడ వివాహం చేసుకోబోతున్నందన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందుకు సంబంధించి ఆమె ఓ ప్రముఖ దుబాయ్ యూట్యూబర్ ఖలీద్ అల్ అమెరీతో నిశ్చితార్థం కూడా అయిపోయిందని ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఇకపోతే దుబాయ్ కి చెందిన ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఖలీద్ అల్ అమెరీ సోమవారం నాడు సునయనతో నిశ్చితార్థం చేసుకున్నట్లుగా అధికారికంగా తెలిపారు.
RBI: ఇప్పటికీ రూ.7000 కోట్ల విలువైన రూ.2000 నోట్లు ప్రజల వద్దే ఉన్నాయ్..
జూన్ 5న సునైనా రెండు చేతులు ఒకరికొకరు పట్టుకున్నట్లుగా ఉన్న ఓ ఫోటోని షేర్ చేసింది. దాంతోనే చాలామంది ఆవిడ నిశ్చితార్థం చేసేసుకుందని అనుకోగా.. అప్పటికి మాత్రం ఆవిడ కాబోయే భర్త ఎవరన్న విషయాన్ని మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఆ తర్వాత ఖలీద్ ఈ పోస్టును లైక్ చేశాడు. ఆ తర్వాత జూన్ 26న ఖలీద్ డైమండ్ రింగు తొడిగిన ఓ అమ్మాయి చేయి పట్టుకున్న ఫోటోను పోస్ట్ చేయగా.. వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నట్లు అధికారికంగా స్పష్టమైంది. దీంతో పలువురు సెలబ్రెటీలు సోషల్ మీడియా నెటిజన్స్, సినిమా ప్రేక్షకులు వారికి శుభాకాంక్షలు తెలిపారు.
Sunaina : దుబాయ్ యూట్యూబర్ తో పెళ్లిపీటలెక్కబోతున్న హీరోయిన్.. బ్యాగ్రౌండ్ మాములుగా లేదుగా..
ఇక ఖలీద్ విషయాని కొస్తే.. ఆయన ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ ని నడుపుతున్నాడు. వినోదాత్మక వీడియోలని పంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఈ మధ్యనే ప్రముఖ నటుడు మమ్ముట్టితో కలిసి చేసిన ఇంటర్వ్యూ ద్వారా ఆయన బాగా పాపులారిటీ సంపాదించాడు.. అయితే వీరిద్దరు పెళ్లి ఎప్పుడు చేసుకోబోతున్నారన్న విషయం మాత్రం ఇంకా తెలియ రాలేదు.