Actress Sindhu Passes Away Due To Unable to afford Breast Cancer Treatment: ఆస్పత్రి ఖర్చులకు డబ్బులేక నటి సింధు ప్రాణాలు కోల్పోయారు. బ్రెస్ట్ క్యాన్సర్ (రొమ్ము క్యాన్సర్)తో కొన్నాళ్లుగా బాధపడుతున్న 44 ఏళ్ల సింధు.. ఈరోజు (ఆగష్టు 7) వేకువజామున తమిళనాడు కిలిపక్కంలోని ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆసుపత్రి ఖర్చులను భరించలేక ఆమె కొంతకాలం ఇంట్లోనే చికిత్స తీసుకున్నారు. సింధు మరణం పట్ల తోటీ నటీనటులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
2020లో సింధు రొమ్ము క్యాన్సర్ బారిన పడ్డారు. మధ్య తరగతి జీవితంకు తోడు సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కాబట్టి మెరుగైన వైద్యం చేయించుకునేందుకు ఆమె వద్ద సరిపడా డబ్బులు లేవు. క్యాన్సర్ మహమ్మారి బాదిస్తుండడంతో ఏం చేయాలో అర్థం కాలేదు. చేతుల్లో డబ్బులేక ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకున్నారు. కొన్నిరోజుల క్రితం ఆరోగ్యం మరింత విషమించడంతో.. ఆమెను కిలిపక్కంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కుటుంబ సభ్యులు చేర్పించారు. చికిత్స చేయించుకునేందుకు సరిపడా డబ్బుల్లేక నేడు ప్రాణాలు వదిలేశారు.
పేద కుటుంబంలో పుట్టిన సింధుకు 14వ సంవత్సరంలోనే తల్లిదండ్రులు పెళ్లి చేశారు. ఏడాది తర్వాత ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చారు. నటి అయినప్పటికీ సింధుకు ఆర్ధిక సమస్యలు తగ్గలేదు. దానికి తోడు క్యాన్సర్ మహమ్మారి ఆమె కుటుంబాన్ని కబళించేసింది. 2010లో తెలుగు హీరోయిన్ అంజలి నటించిన ‘షాపింగ్ మాల్’ సినిమాలో సింధు ఓ పాత్ర చేశారు. ఆ తర్వాత పలు సినిమాల‍్లో ఆమె సహాయ పాత్రలు చేశారు.