NTV Telugu Site icon

Casting Couch: తమిళ చిత్ర పరిశ్రమలోనూ కాస్టింగ్ కౌచ్.. నేను చేదు సంఘటనలు ఎదుర్కొన్నా: హీరోయిన్

Sanam Shetty

Sanam Shetty

Sanam Shetty About Kolkata Doctor Murder: తమిళ సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ సమస్యలు ఉన్నాయని హీరోయిన్ సనమ్ శెట్టి పేర్కొన్నారు. తానకు కూడా చేదు సంఘటనలు ఎదురయ్యానని చెప్పారు. మిగతా చిత్ర పరిశ్రమల్లో మాదిరిగా ఇక్కడ కూడా దర్శక, నిర్మాతల నుంచి మహిళలకు సమస్యలు ఎదురవుతాయన్నారు. కమిట్‌మెంట్ కారణంగా తాను చాలా సినిమాలు వదులుకున్నాని సనమ్ తెలిపారు. కేరళకు చెందిన హేమ కమిటీ నివేదికను ఉద్దేశించి సనమ్ షాకింగ్ కామెంట్స్ చేశారు.

కోల్‌కతాలో జూనియర్‌ వైద్యురాలిపై హత్యాచారం, హత్య కేసు తర్వాత మహిళలపై జరుగుతున్న నేరాలను ఖండిస్తూ.. ర్యాలీకి అనుమతి కోరేందుకు చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంకు సనమ్ శెట్టి వెళ్లారు. ర్యాలీకి పోలీసుల నుంచి పర్మిషన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అనంతరం సనమ్ శెట్టి మీడియాతో మాట్లాడుతూ… ‘కోల్‌కతాలోని వైద్య కళాశాలలో జూనియర్‌ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనను నిరసిస్తూ ర్యాలీ చేపట్టాలనుకుంటున్నా. అందుకు పోలీసుల నుంచి పర్మిషన్‌ కోసం దరఖాస్తు పెట్టా. పోలీసులు నాకు అండగా ఉంటారని నమ్ముతున్నా’ అని చెప్పారు.

Also Read: Gold Rate Today: గోల్డ్‌ లవర్స్‌కి షాకింగ్ న్యూస్.. భారీగా పెరిగిన బంగారం ధరలు!

‘సినిమా అనే కాదు అన్ని రంగాల్లోనూ మహిళలు వేధింపులను ఎదుర్కొంటున్నారు. మలయాళీ ఇండస్ట్రీ నటీమణులు ఎదుర్కొంటున్న క్యాస్టింగ్‌ కౌచ్‌పై ఇటీవల జస్టిస్‌ హేమ కమిటీ ఇచ్చిన నివేదిక గురించి తెలిసి షాకయ్యా. అలాంటి పరిస్థితులే తమిళ చిత్ర పరిశ్రమలోనూ ఉన్నాయి. అయితే వాటిని బయటపెట్టడానికి ఎవరూ ముందుకురారు. నేనూ చాలా చేదు సంఘటనలు ఎదుర్కొన్నా. కమిట్‌మెంట్ ఇవ్వలేక చాలా సినిమా అవకాశాలను కూడా కోల్పోయా. ఇలాంటి ఘటనలు ఎదురైనప్పుడే ఎందుకు మాట్లాడారు? అని చాలా మంది అంటున్నారు. పరిస్థితుల రీత్యా కొన్నిసార్లు బయటకువచ్చి మాట్లాడలేం కదా. లైంగికంగా వేధించే వారి గురించి ధైర్యంగా బయటకు వచ్చి చెప్పడం మహిళలు నేర్చుకోవాలి’ అని సనమ్ శెట్టి పేర్కొన్నారు. 2012లో అంబులి అనే తమిళ చిత్రంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. మలయాళం, తెలుగు చిత్రాల్లోనూ యాక్ట్‌ చేశారు.