NTV Telugu Site icon

Renu Desai: గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న పవన్ మాజీ భార్య

Renu

Renu

Renu Desai: ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్లకు ఏమవుతుంది.. గత కొంతకాలంగా హీరోయిన్లు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం తెల్సిందే. ఒకరి తరువాత ఒకరు ఏదో ఒక వ్యాధికి గురు అవుతుండడం ఇండస్ట్రీని బెంబేలెత్తిస్తోంది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మయోసైటిస్ వ్యాధి బారిన పడినట్టు బయటపెట్టినప్పటి నుంచి ఒక్కసారిగా హీరోయిన్లు తమ తమ అనారోగ్య సమస్యలను బయటపెడుతున్నారు. సమంత, కల్పిక గణేష్, మమతా మోహన్ దాస్, పూనమ్ కౌర్.. ఒక్కొక్కరిగా తమ అనారోగ్య సమస్యల గురించి అభిమానులతో చెప్పుకొస్తున్నారు. తాజాగా ఆ లిస్ట్ లో చేరింది పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి రేణు దేశాయ్. గత కొంతకాలంగా తాను గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు చెప్పుకొచ్చి షాకిచ్చింది.

బద్రి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రేణు.. ఆ సినిమా సెట్ లోనే పవన్ ను ప్రేమించి పెళ్లాడింది. ఇక ఇద్దరు పిల్లలు పుట్టాకా.. భర్తతో విబేధాలు రావడంతో ఆమె పవన్ కు విడాకులు ఇచ్చి ఇద్దరు పిల్లలతో కలిసి ఒంటరిగా నివసిస్తోంది. ఇక ఈ మధ్యనే రీ ఎంట్రీ ప్లాన్ చేసిన రేణు.. రవితేజ నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో నటిస్తోంది. అంతా బాగుంది అని అనుకున్న సమయంలో రేణు తన అనారోగ్య సమస్యను చెప్పి అందరికి షాక్ ఇచ్చింది. “నేను కొన్ని సంవత్సరాల నుండి గుండె మరియు కొన్ని ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాను. నా సన్నహితులందరికి ఈ విషయం తెలుసు. కొన్నిసార్లు వాటన్నింటిని అర్థం చేసుకునే శక్తిని కనుగొనడం చాలా కష్టంగా ఉంటుంది. అయితే ఈరోజు నేను దీన్ని ఇక్కడ పోస్ట్ చేయడానికి కారణం ఏమిటంటే,నాలా ఎవరైనా బాధపడుతుంటే వారిలో ధైర్యాన్ని నింపేందుకు పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేసేందుకు చెబుతున్నాను. ఎట్టి పరిస్థితిలో మీ ధైర్యాన్ని కోల్పోవద్దు.. బలంగా ఉండండి. ఏదో ఒక రోజు మనకు ఫలితం వస్తుంది. ఎప్పటికీ ఆశను కోల్పోవద్దు. నిరుత్సాహపడొద్దు. జీవితం మీద మన మీద మనకు నమ్మకం వుండాలి. ఈ ప్రపంచం మనకోసం ఎన్నో సర్ ప్రైజ్ లను ప్లాన్ చేసింది. ప్రస్తుతం చికిత్స తీసుకొంటూ మందులు వాడుతున్నాను. యోగా చేస్తున్నాను.. పోషకాహారం తీసుకుంటున్నాను. నేను సాధారణ జీవితానికి తిరిగి రావాలని మరియు త్వరలో షూటింగ్‌కి రావాలని ఆశిస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చింది. దీంతో అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని కామెంట్స్ పెడుతున్నారు.

Show comments