NTV Telugu Site icon

Actress Regina Cassandra: మంత్రి సీతక్కను కలిసిన హీరోయిన్ రెజీనా.. ఎందుకంటే?

Regina

Regina

Actress Regina Cassandra: రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కను ప్రముఖ హీరోయిన్ రెజీనా మంగళవారం సచివాలయంలో కలిశారు. తాము తలపెట్టిన ‘రూరల్ విమెన్ లీడర్ షిప్’ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరుకావాలని మంత్రి సీతక్కను రెజీనా ఆహ్వానించారు. ఈ మేరకు మంత్రికి ఆహ్వానపత్రాన్ని అందజేశారు. అనంతరం పలు అంశాలపై మంత్రి సీతక్కతో హీరోయిన్ రెజీనా చర్చించారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.

Read Also: Tollywood : వారిద్దరికి హిట్టు తప్పనిసరి.. లేదంటే ఇబ్బంది తప్పదు..

Show comments