NTV Telugu Site icon

Ranya Rao : నటి రన్యా రావు బంగారం స్మగ్లింగ్.. రోజుకో కొత్త ట్విస్ట్!

Ranya Rao

Ranya Rao

Ranya Rao : నటి రన్యా రావు కేసులో వెలుగు వస్తున్న కొత్త కొత్త విషయాలు.. ఇప్పటివరకు ఎవరు చేయని రీతిలో రన్యా రావు బంగారం స్మగ్గింగ్ చేసింది.. ఏడాదిలోనే 25 సార్లు దుబాయ్ కి వెళ్లి వందల కోట్ల రూపాయల బంగారాన్ని స్మగ్లింగ్ చేసింది. దుబాయ్ నుంచి తీసుకొచ్చిన బంగారాన్ని ఎవరికి అమ్మారనే దాని పైన విచారిస్తే ఒక ప్రముఖ వ్యాపారవేత్త పేరు వెలుగులోకి వచ్చింది.. రన్యా రావు, స్నేహితుడిని ఇప్పటికే అరెస్టు చేసి పోలీసులు విచారిస్తున్నారు.. మరోవైపు నటి రోజుకు ఒక కొత్త వాదన వినిపిస్తుంది.. తనకు ఎవరో బెదిరించి బంగారం స్మగ్లింగ్ ఏమంటే చేశానని తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పింది ..మరొకరు బంగారాన్ని ఎలా స్మగ్నం చేయాలో యూట్యూబ్లో చూసి నేర్చుకొని ఆ విధంగా స్మగ్లింగ్ చేసానని చెప్తుంది.. మరోవైపు ఈడి సిబిఐ కాస్టమ్స్ మూడు సంస్థలు మాత్రం నటి రన్యా రావు, కేస్ పై సీరియస్గా విచారణ జరుగుతున్నారు. హవాలా మనీ ల్యాండ్రింగ్ కేసును ఈడి విచారణ జరుగుతుండగా, అక్రమంగా బంగారాన్ని తీసుకోవచ్చారన్న దానిపై కస్టమ్స్ విచారణ జరుగుతుంది. దాంతో పాటు కస్టమ్స్ డ్యూటీ ఎగవేసి ఇండియాలోకి బంగారాన్ని తీసుకువచ్చిన నేపథ్యంలో డిఆర్ఐ విచారణ జరుగుతుంది.. ఈ కేసులో ఎవరెవరున్నారు.. నటి వెనకాల ఉన్న స్మగ్లర్ ఎవరు.. రన్యా రావు, ఎయిర్పోర్ట్లో ప్రోటోకాల్ సౌకర్యం కల్పించిన వాళ్ళు ఎవరు. మాజీ డిజిపి రామ్ చంద్ర రావు పాడితే పాత్ర ఏంటి ..రాజకీయ నాయకులకు సంబంధాలు ఏంటి ..వ్యాపారవేత్తల సంబంధాలపై సిబిఐ విచారణ జరుగుతుంది.. అన్ని కలిపి నటి రన్యా రావు, విషయం ఎప్పుడూ రాజకీయ సినీ వ్యాపారవేత్తల మెడకు చుట్టుకోవడంతోపాటు పోలీసు అధికారుల మెడకు కూడా చుట్టుకుంది. ఇదిలా ఉంటే మరొక మరో ఈడి డిఆర్ఏలు కలిపి రంగారావు ఇల్లు స్నేహితులు భర్త ఏళ్లలో సోదాలు నిర్వహించింది. దుబాయ్ కి వెళ్లి తిరిగి వచ్చేందుకు అవసరమైన టికెట్లను ప్రతిసారి కూడా రన్యా రావు, తన భర్త క్రెడిట్ కార్డు ని వాడేసింది.

బంగారం అక్రమ రవాణా కేసులో పట్టుబడిన నటి రన్యా రావు, ఆమె సన్నిహితుల ఇళ్లలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) సోదాలు చేపట్టింది. బెంగళూరులోని ల్యావెల్లి రోడ్డులోని రన్యా రావు ఇల్లు, కోరమంగళ, జయనగర, బసవనగుడి తదితర ప్రాంతాల్లోని ఆమె బంధుమిత్రుల నివాసాల్లో అధికారులు సోదాలు జరిపారు. రన్యా రావు విదేశాలకు వెళ్లడానికి విమానం టికెట్లు బుక్‌ చేసింది ఎవరు, ఈ టూర్లకు సాయం చేసిందెవరు, ఆమె వ్యవహారాల్లో ఎవరెవరి పాత్ర ఎంత? అనే విషయాలను తేల్చడానికి ఈ సోదాలు జరిపిన అధికారులు కొన్ని ఆధారాలు లభ్యమైనట్లు సమాచారం.

బంగారం దందా చాలా పెద్దస్థాయిలో, దేశవ్యాప్తంగా ఉండి ఉండొచ్చని ఈడీ అనుమానిస్తోంది. రన్యా రావును కస్టడీలో విచారించిన డీఆర్‌ఐ అధికారులు ఆమె ఆప్తుడు, పారిశ్రామికవేత్త తరుణ్‌ రాజ్‌ను ప్రశ్నిస్తున్నారు. నటిపై డీఆర్‌ఐ కేసు నమోదుచేసి విచారిస్తుండగా, సీబీఐ రంగంలోకి దిగడం తెలిసిందే. ఈ రెండింటి ఆధారంగా తాజాగా ఈడీ మనీలాండరింగ్‌ కేసు నమోదు చేసింది. ఈ నెల 3న దుబాయ్‌ నుంచి బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రయానికి వచి్చన రన్యా రావు వద్ద డీఆర్‌ఐ అధికారులు 12.56 కోట్ల విలువైన బంగారం కడ్డీలను స్వాధీనం చేసుకోవడం తెల్సిందే.

బంగారాన్ని అక్రమంగా ఎలా రవాణా చేయాలో యూట్యూబ్‌ చూసి నేర్చుకున్నానని డైరెక్టరేట్ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారుల విచారణలో నటి రన్యారావు పేర్కొన్నట్లు సమాచారం. మార్చి 1న విదేశీ నంబరు నుంచి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌ చేశాడు. దుబాయి విమానాశ్రయం నుంచి బంగారాన్ని తీసుకుని, బెంగళూరులో నేను చెప్పిన వ్యక్తికి అందించు అని బెదిరించాడని ఆమె చెప్పినట్లు తెలిసింది. నాకు రెండు ప్లాస్టిక్‌ కవర్లలో బంగారం కడ్డీలను ఇచ్చారు. వాటిని దాచడానికి అవసరమైన బ్యాండేజ్‌లు, కత్తెరను విమానాశ్రయంలో కొన్నారు.

నేను రెస్ట్‌రూంకు వెళ్లి బంగారు కడ్డీలను తొడల చుట్టూ, జీన్స్‌లో, బూట్లలో దాచాను. ఇలా చేయడాన్ని యూట్యూబ్‌ వీడియోలు చూసి నేర్చుకున్నానని డీఆర్‌ఐ అధికారులకు రన్యారావు తెలిపినట్లు సమాచారం. ఫొటోషూట్లు, రియల్‌ ఎస్టేట్‌ వ్యవహారాల కోసమే తాను పలుమార్లు దుబాయికి వెళ్లినట్లు, గతంలో ఐరోపా, ఆఫ్రికా దేశాలతోపాటు అమెరికాకూ రాకపోకలు సాగించినట్లు తెలిపింది. ఆమె చెప్పినవి నమ్మశక్యంగా లేకపోవడంతో మరోసారి విచారించాలని అధికారులు భావిస్తున్నారు. ఫోన్‌ చేసిన వ్యక్తి ఎందుకు బెదిరించాడు, ఏమని బెదిరించాడు, అతనికి ఎందుకు భయపడాల్సి వచ్చిందనే విషయాలను నటి నుంచి రాబట్టాల్సి ఉందని అధికారులు చెప్పారు. రన్యారావు, ఆమె భర్త జతిన్‌ హుక్కేరికి చెందిన నివాసాలు, కార్యాలయాలపై ఈడీ అధికారులు తనిఖీలు చేశారు. కోరమంగల, ల్యావెల్సీ రోడ్డు, హెచ్‌ఎస్‌ఆర్‌ లేఅవుట్ పరిధిలోని ఎనిమిది చోట్ల సోదాలు నిర్వహించారు