NTV Telugu Site icon

Actress Prema: ఆయనంటే చాలా భయం.. వామ్మో డైరెక్ట్‎గా చూడటమే

Kannada Actress Prema

Kannada Actress Prema

Actress Prema: తెలుగు ప్రేక్షకులకు నటీమణి ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. కన్నడ సినిమాతో వెండితెరకు పరిచయమైన ప్రేమ, వెంకటేశ్ నటించిన ధర్మచక్రం సినిమా ద్వారా టాలీవుడ్ లో ఎంటర్ అయ్యారు. ఇక ‘ఓంకారం’ ..’మా ఆవిడ కలెక్టర్’ .. ‘దేవి’ సినిమాలు ఆమెకి మరింత మంచి పేరును తీసుకుని వచ్చాయి. ఇక పలు చిత్రాల్లో దేవత పాత్రలు చేసి మరింత పాపులర్ అయ్యారు. ఆ తరువాత సినిమాలకి దూరమయ్యారు.

Read Also: Google Fine: గూగుల్‎కు ఎదురుదెబ్బ.. వారంలో రెండోసారి భారీ ఫైన్

14 ఏళ్ల తరువాత ‘అనుకోని ప్రయాణం’ సినిమాతో ఆమె రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ నెల 28వ తేదీన ఈ సినిమా థియేటర్లకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆమె ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో తన కెరియర్ కి సంబంధించిన అనేక విషయాలను పంచుకున్నారు. తనకు కన్నడ హీరో శివరాజ్ కుమార్ తో నటించాలన్నది కల గా పేర్కొంది. ఆయనతోనే తొలి సినిమా చేస్తుంటే డైలాగ్స్ చెప్పలేకపోయి.. చాలా సార్లు తిట్టించుకున్నానంటూ చెప్పింది. ” కన్నడలో ‘ఓం’ చూసి రామానాయుడు గారు ‘ధర్మచక్రం’ సినిమాలో అవకాశం ఇచ్చారని తెలిపారు.

నేను కొంచెం హైట్ ఎక్కువ .. కాకపోతే అది నా కెరియర్ కి అడ్డుకాలేదనే అనుకుంటున్నాను. ‘రాయలసీమ రామన్న చౌదరి’ సినిమాలో మోహన్ బాబుగారితో కలిసి నటించాను. ఆయనను డైరెక్టుగా చూడాలంటేనే భయపడేదానిని. అలాంటిది ఆయనతో పోటీపడి చేయవలసి వచ్చింది. ఆయన ఏమీ అనలేదు .. తిట్టలేదు. ఆయనతో కలిసి పనిచేయడాన్ని ఎప్పటికీ మరిచిపోలేను” అంటూ చెప్పుకొచ్చారు.

RGV Tweet On Rishi Sunak : రిషి సునాక్‎పై ఆర్టీవీ సంచలన ట్వీట్.. అవకాశం దొరికిందంటూ

ఆ తర్వాత మోహన్ బాబు గారితో రాయలసీమ రామన్న చౌదరి సినిమాలో నటించాను. ఆయనతో నటించడమే కష్టం అంటే.. నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించడం అనేది చాలా కష్టంగా మారింది. ఆయన్ని డైరెక్ట్ గా చూడాలంటే భయం వేసేది. అయినా కూడా షూటింగ్ సమయంలో మోహన్ బాబు గారి కి పోటీగా నటించానంటూ అప్పటి విషయాలను చెప్పుకొచ్చింది.