Nayanthara As Bigg Boss Tamil 8 Host: ‘బిగ్‌బాస్’ షో అన్ని భాషల్లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో బాగా సక్సెస్ అయింది. తెలుగుతో పాటు తమిళంలోనూ బిగ్‌బాస్ 8 సీజన్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఇందుకు సంబందించి ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. తమిళ్ బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్‌కు హోస్ట్‌గా లోకనాయకుడు కమల్ హాసన్ వ్యవహరించడం లేదు. దాంతో ఆయన స్థానంలో ఎవరు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.
బిజీ షెడ్యూల్ కారణంగా తమిళ్ బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరించడం లేదు అని కమల్ హాసన్ ప్రకటించారు. దాంతో హోస్ట్‌గా కొందరు స్టార్స్ పేర్లు వినిపిస్తున్నాయి. చాలా మంది స్టార్ హీరోలు హోస్ట్‌గా వ్యవహరించనున్నారని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా విజయ్ సేతుపతి, సూర్య, శింబు పేర్లు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి స్టార్ హీరోయిన్ పేరు కూడా వచ్చింది.
Also Read: Gold Price Today: పెరిగిన గోల్డ్ రేట్స్.. హైదరాబాద్‌లో తులం ఎంతుందంటే?
తమిళ్ బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్‌కు హోస్ట్‌గా లేడీ సూపర్ స్టార్ నయనతార వ్యవహరించనున్నారని సమాచారం. బిగ్‌బాస్ నిర్మాణ సంస్థ ఇప్పటికే నయనతారను సంప్రదించిందని టాక్ వినిపిస్తుంది. ఆమె సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. నయనతార వరుస హిట్స్ కొట్టి మంచి జోష్ లో ఉన్న విషయం తెలిసిందే. నయన్ అయితే షోకి గ్లామర్ కూడా వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరోవైపు నటుడు ఆర్ శరత్‌కుమార్ కూడా రేసులో ఉన్నట్లు మరికొన్ని నివేదికలు సూచిస్తున్నాయి.