Megha Akash : టాలీవుడ్ హీరోయిన్ మేఘా ఆకాష్.. రజనీకాంత్‌తో ‘పెట్టా’ సినిమాతో తమిళ చిత్ర పరిశ్రమలో నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో ఆమె కీలక పాత్ర పోషించింది. తర్వాత ఏడాది హీరో ధనుష్ సరసన ఎనై నోకి పాయుమ్ తోటలో హీరోయిన్‌గా చేసింది. ఆ తర్వాత తమిళంలో విజయ్ సేతుపతి, శింబు వంటి ప్రముఖ నటుల సరసన నటించిన మేఘా ఆకాష్ తెలుగు, మలయాళ చిత్రాల్లోనూ నటించింది. తెలుగులో నితిన్ తో కలిసి లై అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో చేసినా పెద్ద హిట్ అందుకోలేకపోయింది. ఇదిలా ఉండగా మాజీ మంత్రి తిరునావుకరసర్ కుమారుడు సాయివిష్ణుతో ఆమె ప్రేమలో పడింది. వీరు గత ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమకు కుటుంబ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సాయి విష్ణు, మేఘా ఆకాష్ పెళ్లితో ఒక్కటయ్యారు.
Read Also:Shreyas Iyer: పాపం శ్రేయస్ అయ్యర్.. మళ్లీ నిరాశే! ఇప్పట్లో కష్టమే
వీరి పెళ్లికి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, మంత్రులు ఉదయనిధి స్టాలిన్, అన్బిల్ మహేష్, కేకేఎస్సార్ రామచంద్రన్ సహా పెద్ద సంఖ్యలో రాజకీయ నేతలు హాజరయ్యారు. ఆ తర్వాత మేఘా ఆకాష్ – సాయి విష్ణు జంట వివాహం ఘనంగా జరిగింది. బంధువులు, స్నేహితులు మాత్రమే హాజరై వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఆమె పెళ్లి ఫోటోలు కూడా విడుదలై ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తానని నటి మేఘా ఆకాష్ చెప్పడం గమనార్హం. కానీ ఈ మధ్య కాస్త గ్యాప్ తీసుకుని కొత్త జంట హనీమూన్ కు వెళ్లింది. మేఘ ఆకాష్ – విష్ణు ఇటలీ దేశానికి హనీమూన్ కి వెళ్లారు. ఇటలీలో అమల్ఫీ అనే పర్యాటక ప్రాంతంలో ఈ కొత్త జంట తెగ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా హనీమూన్ నుంచి మేఘ ఆకాష్ పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో పంచుకున్నారు.
Read Also:Festive Rush: హైదరాబాద్‌లోని బస్సులు, రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ..