సినీ ఇండస్ట్రీలో మీనా అంటే తెలియని వారుండరు. బాలనటిగా కెరీర్ స్టార్ట్ చేసి, సౌత్ ఇండియాలోని అందరు స్టార్ హీరోలతో నటించి ‘మహారాణి’ అనిపించుకున్నారు. భర్త విద్యాసాగర్ మరణం తర్వాత తన కూతురు నైనిక కోసం మళ్లీ సినిమాల్లో బిజీ అవుతుంది మీనా. అయితే మీనా భర్త చనిపోయినప్పటి నుండి ఆమె రెండో పెళ్లి గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ ఆ వార్తలన్నిటినీ మీనా ఖండిస్తూ వచ్చారు. ప్రస్తుతం ఆమె తన కూతురు కెరీర్ మీద, అలాగే మలయాళంలో ‘దృశ్యం 3’, తమిళంలో ‘రౌడీ బేబీ’ సినిమాల మీద ఫోకస్ పెట్టారు. ఇకపోతే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న మీనా ఒక స్టార్ హీరో వల్ల తన గుండె ముక్కలైందని ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Also Read : Psych Siddhartha: ఓటీటీలోకి వచ్చేసిన ‘సైక్ సిద్ధార్థ’.. కానీ ?
మీనా ఇష్టపడ్డ ఆ హీరో మరెవరో కాదు.. బాలీవుడ్ ‘గ్రీక్ గాడ్’ హృతిక్ రోషన్. అవును, మీనాకు హృతిక్ అంటే ప్రాణం అట. అప్పట్లో ఆయన అందానికి, యాక్టింగ్‌కి ఫిదా అయిపోయిన మీనా.. “పెళ్లంటూ చేసుకుంటే హృతిక్ రోషన్‌నే చేసుకుంటా” అని తన తల్లితో కూడా చెప్పేవారట. అంతగా ఆయనతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు ఈ సీనియర్ నటి. అయితే, మీనా ఆశలు అడియాశలయ్యాయి. హృతిక్ రోషన్‌కు పెళ్లి అయిందన్న వార్త వినగానే తన మనసు ముక్కలైందని మీనా ఒక ఇంటర్వ్యూలో సరదాగా చెప్పుకొచ్చారు.. ‘అప్పటికి నాకు ఇంకా పెళ్లి కాలేదు.. కానీ ఆయనకు పెళ్లి అయిపోయిందని తెలిసి చాలా బాధపడ్డాను” అని నవ్వుతూ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత ఒక కార్యక్రమంలో హృతిక్ ను కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చిన ఫోటో ఇప్పటికీ తన దగ్గర భద్రంగా ఉందని, అది తనకు ఒక తీపి గుర్తు అని తెలిపారు.
