Site icon NTV Telugu

Abduction Case: యువకుడి కిడ్నాప్ కేసు.. పరారీలో స్టార్ హీరోయిన్!

Lakshmi Menon

Lakshmi Menon

ఈ మధ్య నటీనటులుగా గుర్తింపు తెచ్చుకున్న అనంతరం పలువురు తారలు వివాదాల్లో చిక్కుకుంటున్నారు. సామాన్యులతో దురుసు ప్రవర్తన, సోషల్ మీడియాలో పోస్టులతో నిత్యం వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా ఓ హీరోయిన కిడ్నాప్ కేసులో చిక్కుకుంది. దీంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆ హీరోయిన్ పరారీలో ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళితే..

మలయాళీ సినిమాల్లో నటిగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ లక్ష్మీ మీనన్. 2011లో విడుదలైన రఘువింతే స్వాంతం రసియా అనే సినిమాతో సీనీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. గజరాజు, ఇంద్రుడు, చంద్రముఖి 2 వంటి డబ్బింగ్ సినిమాతో తెలుగు అడియన్స్‌కు దగ్గరైంది. అయితే తహగా లక్ష్మీ మీనన్ నిజ జీవితంలో ఓ రౌడీలా ప్రవర్తించింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది.

Also Read: Google Maps: గూగుల్ మ్యాప్‌ను నమ్మితే నట్టేట ముంచింది.. ఒకరు మృతి, ముగ్గురు గల్లంతు!

ఆగస్ట్ 24న రాత్రి లక్ష్మీ మీనన్ తన స్నేహితులతో కలిసి కొచ్చిలోని వెలాసిటీ పబ్‌కు వెళ్లింది. అక్కడ కొచ్చిలో టెకీగా పనిచేస్తున్న ఓ యువకుడితో వారికి గొడవ జరగింది. గొడవ తీవ్రస్థాయికి చేరుకుంది. దాంతో లక్ష్మీ మీనన్ తన స్నేహితులతో కలిసి అతడిని తమ కారులో ఎక్కించుకుని.. బెదిరిస్తూ, బూతులు తిడుతూ హింసించారు. అతడిని కొట్టిన తర్వాత మరో చోట విడిచిపెట్టి వెళ్లిపోయారు. టెకీ పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు అయింది. లక్ష్మీ మీనన్ స్నేహితులు ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లక్ష్మీ మీనన్ పరారీలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిగ్‌ గా మారింది. అయితే లక్ష్మీ మీనన్‌కు కేరళ హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించినట్లు తెలుస్తోంది. కేసులో తన అరెస్ట్‌ను అడ్డుకోవాలని కోర్టును ఆశ్రయించగా.. ఆమెకు మద్దతుగా తీర్పునిచ్చిందని సమాచారం.

Exit mobile version