NTV Telugu Site icon

Actress Hema: బెంగళూరు జైలు నుంచి విడుదలైన సినీనటి హేమ

Actress Hema

Actress Hema

Actress Hema: బెంగళూరు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన హేమ బెంగళూరు జైలు నుంచి విడుదలయ్యారు. బెంగళూరు రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో సినీనటి హేమ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. గురువారం ఆమెకు బెంగళూరు కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇవ్వడంతో జైలు నుంచి ఆమెను విడుదల చేశారు. కొన్నాళ్ల క్రితం బెంగళూరు నగర శివారులో ఒక ఫామ్ హౌస్ లో జరిగిన రేవ్ పార్టీలో హేమ మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చి చట్ట ప్రకారం ఆమెను అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆమెను బెంగుళూరు సిటీ క్రైమ్ కంట్రోల్ బ్యూరో పోలీసులు విచారించి అరెస్ట్ చేశారు. ఆమెను కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ క్రమంలో తాజాగా హేమకు కోర్టు బెయిల్ రావడం పోలీసులు జైలు నుంచి విడుదల చేశారు.

Read Also: Mahesh Babu : ఫ్యామిలీతో వేకెషన్ కు వెళ్తున్న మహేష్.. లేటెస్ట్ లుక్ అదిరిపోయిందిగా…

హేమ వద్ద ఎలాంటి డ్రగ్స్ లేవని ఆమెపై ఆరోపణలు వచ్చిన పది రోజులకు వైద్య పరీక్షలు నిర్వహించారని హేమ తరపు న్యాయవాది కోర్టులో వాదించారు. హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసుల దగ్గర సాక్షాలు లేవని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అయితే హేమ రేవ్ పార్టీలో పాల్గొన్న ఆధారాలను సీసీబీ న్యాయవాది కోర్టుకు అందించారు. ఇక ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం నటి హేమకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం. ఇక తాను డ్రగ్స్ తీసుకోలేదని ముందు నుంచి హేమ చెబుతూ వచ్చారు. అయితే తాను బెంగళూరులో ఉన్నా సరే హైదరాబాదులో ఉన్నాను అంటూ వీడియో రిలీజ్ చేయడం పెద్ద చర్చకు దారితీసింది. ఈ విషయంలోనే బెంగళూరు పోలీసులు సైతం సీరియస్ అయ్యారు.

Show comments