Actress Hema wrote a letter to Bangalore CCB: బెంగళూరు డ్రగ్స్ కేసు (బెంగళూరు రేవ్‌పార్టీ)లో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. బెంగళూరు పోలీసుల విచారణకు టాలీవుడ్ సీనియర్ నటి హేమ డుమ్మా కొట్టారు. ఈరోజు (మే 27) తాను విచారణకు హాజరుకాలేనని బెంగళూరు పోలీసులకు ఆమె లేఖ రాశారు. ప్రస్తుతం తాను వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నానని, విచారణకు హాజరయ్యేందుకు సమయం కావాలని బెంగళూరు సీసీబీకి రాసిన లేఖలో హేమ పేరొన్నారు. అయితే హేమ లేఖను సీసీబీ పరిగణలోకి తీసుకోలేదు. హేమకు మరో నోటీస్ ఇచ్చేందుకు బెంగుళూరు పోలీసులు సిద్దమయ్యారు.
Also Read: Bharateeyudu Re-Release: భారతీయుడు రీ-రిలీజ్.. నేడు ట్రైలర్ విడుదల!
మే 19న ‘సన్ సెట్ టు సన్ రైజ్ విక్టరీ’ పేరుతో బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ జీఆర్ ఫామ్ హౌస్‌లో రేవ్‌పార్టీ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పార్టీలో దాదాపుగా 150 మంది పాల్గొన్నారు. రేవ్‌పార్టీలో పాల్గొన్న 103 మంది రక్త నమూనాలను బెంగళూరు నార్కొటిక్ టీమ్ సేకరించింది. 103 మందిలో 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. నటి హేమ కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయింది. రక్త నమూనాలు పాజిటివ్‌గా తేలిన వారందరికీ సీసీబీ సమన్లు జారీ చేసింది. 27న విచారణకు హాజరుకావాలని పేర్కొంది. అయితే వైరల్ ఫీవర్ కారణంగా తాను నేడు విచారణకు హాజరు కాలేనని హేమ లేఖ రాశారు. దాంతో హేమపై బెంగళూరు సీసీబీ సీరియస్ అయింది.