Site icon NTV Telugu

Dimple Hayathi Workout: డింపుల్ హ‌యాతి ఫిట్‌నెస్ క‌ష్టాలు.. వీడియో చూస్తే వావ్ అనాల్సిందే!

Dimple Hayathi Workout

Dimple Hayathi Workout

Actress Dimple Hayathi Workout Video Goes Viral: ప్రస్తుత రోజుల్లో ‘ఫిట్‌నెస్’ ప్రతి ఒక్కరికి చాలా ముఖ్య‌మైందిగా మారింది. మ‌రీ ముఖ్యంగా సినీ సెలబ్రీట‌లకు. సిల్వ‌ర్ స్క్రీన్‌పై అందంగా క‌నిపించ‌టానికి ఫిట్‌గా ఉండాల్సిందే. అందుకోసం గంట‌ల తరబడి జిమ్‌లో వ‌ర్కవుట్స్ చేస్తుంటారు. హీరోల కంటే కూడా హీరోయిన్స్ జిమ్‌లో ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు. హీరోయిన్ డింపుల్ హ‌యాతి అయితే ఫిట్‌నెస్ కోసం తెగ కష్టపడుతున్నారు. గంటల కొద్ది సమయాన్ని ఆమె జిమ్‌లో వెచ్చిస్తున్నారు. ఇందుకు సంబందించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

తాజాగా జిమ్‌లో వ‌ర్క‌వుట్ చేసిన వీడియోను డింపుల్ హ‌యాతి త‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన అందరూ షాక్ అవుతున్నారు. ఎందుకంటే.. డింపుల్ చేస్తున్న వ‌ర్క‌వుట్స్ ఆ రేంజ్ ఉన్నాయి మరి. డింపుల్ జిమ్‌లో పొట్టకు సంబందించిన వ‌ర్క‌వుట్స్ చేశారు. కడ్డీలు పట్టుకుని వేలాడుతూ.. అలా ఉండిపోయారు. వెనకాల హీరో కార్తికేయ కూడా ఉన్నాడు. మరో వీడిమోలో డింపుల్ కింద‌ప‌డుకుని ఉంటే.. ఆమె పొట్ట‌పై ట్రైన‌ర్ ఎక్కి నిలుచుకున్నాడు. ఆపై ఆమె పొట్ట‌పై పంచ్‌లు విసిరాడు. ఈ వీడియోలకు లైకుల వర్షం కురుస్తోంది.

Also Read: Viral Video: ఆహారం కోసం ఆశగా నోరు తెరచిన హిప్పోపొటామస్.. ఈ పర్యాటకుడి పనికి అందరూ షాక్!

గ‌ద్ద‌లకొండ గ‌ణేష్ చిత్రంలో ఐటెమ్ సాంగ్‌లో డింపుల్ హ‌యాతి మెరిశారు. ఆ త‌ర్వాత ర‌వితేజ హీరోగా న‌టించిన ఖిలాడి చిత్రంలో గ్లామ‌ర‌స్ పాత్ర‌లో మెప్పించారు. గోపీచంద్ రామ‌బాణంలోనూ హీరోయిన్‌గా నటించారు. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా కొట్టడంతో అమ్మ‌డికి అవకాశాలు కరువయ్యాయి. డింపుల్ మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నారు.

Exit mobile version