Viral Video: ఆహారం కోసం ఆశగా నోరు తెరచిన హిప్పోపొటామస్.. ఈ పర్యాటకుడి పనికి అందరూ షాక్!
- హిప్పోపొటామస్ నోట్లో ప్లాస్టిక్ కవర్
- జంతు ప్రేమికుల ఆగ్రహం
- పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
A Man threw a plastic cover in mouth of Hippopotamus: ఈ భూప్రపంచంలో చాలా మంది జంతు ప్రేమికులు ఉన్నారు. జంతువుల రక్షణ కోసం స్వచ్చంద సంస్థలు కూడా ఉన్నాయి. ఏ జంతువుకైనా చిన్న గాయమైనా అల్లాడిపోయే వారు చాలా మందే ఉన్నారు. కొందరు మాత్రం జంతువుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. తమ ఆనందం కోసం అమాయక జంతువులను హింసిస్తున్నారు. ఇప్పటికే ఏనుగు తినే ఆహారంలో బాంబ్ పెట్టిన ఘటన సంచలనంగా మారగా.. తాజాగా అలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఆహారం కోసం ఆశగా నోరు తెరచిన హిప్పోపొటామస్ నోట్లో ఓ పర్యాటకుడు ప్లాస్టిక్ కవర్ వేశాడు.
వీడియో ప్రకారం… పార్క్‌లో ఉన్న నీటిలో కొన్ని హిప్పోపొటామస్‌లు (నీటి ఏనుగు) ఉన్నాయి. అందులో ఒకటి ఒడ్డున తిరుగుతూ ఉంది. కారులో అటుగా వెళ్తున్న పర్యాటకులను చూసిన అది.. ఆహరం కోసం ఆశగా నోరు తెరిచింది. కారులో ఉన్న ఒక వ్యక్తి.. హిప్పోపొటామస్‌కి క్యారెట్ తినిపించడానికి ప్రయత్నించాడు. ఇంతలోనే అదే కారులో ఉన్న మరొక వ్యక్తి.. హిప్పోపొటామస్ నోటిలోకి ప్లాస్టిక్ కవర్ విసిరాడు. ఆ కవర్ దాని నోట్లో పడగా.. ఆహరం అనుకుని నమిలి మింగేసింది. ఇందుకు సంబదించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
Also Read: Realme Narzo 70 Offer: రియల్‌మీ నార్జో 70పై భారీ తగ్గింపు.. బంపర్ ఆఫర్ ఈ ఒక్క రోజే!
పశ్చిమ జావాలోని బోగోర్‌లోని సఫారీ పార్కులో ఈ ఘటన చోటుచేసుకుంది. హిప్పోపొటామస్ నోటిలోకి ప్లాస్టిక్ కవర్ విసిరిన వీడియో వైరల్‌గా మారడంతో జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో బాధ్యులను అరెస్టు చేయాలని అధికారులను అభ్యర్థించారు. కార్ నంబర్ ఆధారంగా వారిని పట్టుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ప్లాస్టిక్ కవర్ తిన్న హిప్పోను పరీక్షించామని, అది ఆరోగ్యంగానే ఉందని పార్క్ ప్రతినిధి అలెగ్జాండర్ జుల్కర్‌నైన్ తెలిపారు.
A safari park visitor threw a plastic bag into the mouth of a Hippopotamus at the Taman Safari in Indonesia pic.twitter.com/PfApqNusgt
— non aesthetic things (@PicturesFoIder) July 8, 2024
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!