Actress Anandhi: విజయ్ సర్‌కి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది: తెలుగమ్మాయి ఆనంది
- బ్యూటీపార్లర్ ప్రారంభోత్సవానికి ఆనంది
- మీడియా ప్రశ్నలకు ఆనంది సమాధానం
- తెలుగులో ఓ వెబ్‌సిరీస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Heroine Anandhi About Thalapathy Vijay: తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్ కొన్ని నెలల క్రితం ‘తమిళ వెట్రి కళగం’ (టీవీకే) పేరుతో రాజకీయ పార్టీ పెట్టిన విషయం తెలిసిందే. తమిళనాడులో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పోటీ చేయనున్నారు. పార్టీ పెట్టినప్పటినుంచి విజయ్‌కి మద్దతుగా చాలామంది నటీనటులు మద్దతు పలికారు. తాజాగా ఈ జాబితాలోకి తెలుగమ్మాయి ఆనంది చేరారు. రాజకీయాల్లో విజయ్ సర్‌కి తన మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని ఆనంది పేర్కొన్నారు.
తాజాగా హీరోయిన్ ఆనంది తిరుచ్చిలో ఓ బ్యూటీపార్లర్ ప్రారంభోత్సవానికి వెళ్లారు. ప్రారంభోత్సవం అనంతరం మీడియా అడిగిన ప్రశ్నలకు ఆనంది సమాధానం ఇచ్చారు. విజయ్ రాజకీయ ప్రవేశం గురించి అడగ్గా.. ‘విజయ్ సర్ రాజకీయాల్లోకి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. సమాజానికి సేవ చేయాలని విజయ్ రాజకీయాల్లోకి వచ్చారు. నా మద్దతు ఎల్లప్పుడూ విజయ్‌కే ఉంటుంది’ అని ఆనంది చెప్పారు. ‘సినిమా చిత్రీకరణ కోసం పలుమార్లు తిరుచ్చికి వచ్చా. ఇది నాకు ఎప్పటికీ మరచిపోలేని ప్రాంతం. ఇక్కడ దొరికే పలు రకాల ఆహార పదార్థాలు చాలా ఇష్టం. ప్రస్తుతం తెలుగులో ఓ వెబ్‌సిరీస్‌లో నటిస్తున్నా’ అని ఆమె చెప్పారు.
Also Read
Also Read: IND vs SL: శ్రీలంకతో వన్డే సిరీస్.. ముగ్గురు స్టార్ ప్లేయర్స్ ఔట్!
1992 డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్‌లో ఆనంది జన్మించారు. ‘ఈరోజుల్లో’ సినిమాలో చిన్న పాత్ర చేసిన ఆనందికి ‘బస్ స్టాప్’ మంచి బ్రేక్ ఇచ్చింది. పోరియాలన్ సినిమాతో తమిళంలోకి ఎంట్రీ ఇవ్వగా.. కయల్ చిత్రంతో స్టార్ అయ్యారు. తమిళంలో వరుసగా సినిమాలు చేస్తున్న ఆనంది.. తెలుగులో అప్పుడప్పుడు మెరుస్తున్నారు. మరోవైపు విజయ్ ‘ది గోట్’ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్)తో బిజీగా ఉన్నారు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకురానుంది.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!