NTV Telugu Site icon

Vijay On Amit shah: కేంద్రమంత్రి వ్యాఖ్యలపై గట్టి కౌంటర్ ఇచ్చిన నటుడు

Vijay

Vijay

Vijay On Amit shah: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్‌పై కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై విపక్షాలు నిరసనలు, ఆందోళనలను నిర్వహిస్తున్నాయి. ఈ తరుణంలో తాజాగా తమిళ నటుడు, తమిళగ వెట్రి కళగం పార్టీ అధ్యక్షుడు విజయ్ కేంద్రమంత్రి వ్యాఖ్యలపై గట్టి కౌంటర్ ఇచ్చారు. ఆయన ఈ విషయంపై తన సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ఇందులో భాగంగా నటుడు విజయ్ ప్రస్తావిస్తూ.. కొంతమందికి అంబేడ్కర్ పేరు వినడమే నచ్చదు. ఆయన భారత పౌరులందరికీ స్వాతంత్య్ర స్ఫూర్తిని రగిలించిన సాటిలేని రాజకీయ మేధావి. ఆయన వారసత్వం అట్టడుగు ఆశాజ్యోతి. సామాజిక అన్యాయానికి, వ్యతిరేక ప్రతిఘటనకు ప్రతీక. అంబేడ్కర్.. అంబేడ్కర్.. అంబేడ్కర్ అని ఆయన పేరు అంటే మనసు, పెదవులకు సంతోషంగా ఉంటుందని అన్నారు.

Also Read: Leopard attack: చిరుతపులి దాడి.. యువతి మృతి

ఇదిలా ఉంటే, నటుడు విజయ్ గత కొన్ని నెలలుగా ప్రత్యక్ష రాజకీయాల్లో కూడా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పేరుతో ఆయన తాజాగా రాజకీయ పార్టీని స్థాపించారు. పార్టీ ఆవిష్కరణలో భాగంగా ఆయన పార్టీ జెండాను కూడా ఆవిష్కరించారు. పార్టీ మొదటి ర్యాలీలో విజయ్ అంబేడ్కర్, పెరియార్ ఈవీ రామస్వామి, కె.కామరాజ్ వంటి మహనీయుల ఆశయాలను అనుసరించి తమిళనాడులో ప్రగతి కోసం పార్టీ పనిచేస్తుందని పేర్కొన్నారు. త్వరలోనే తమ పార్టీ తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల కోసం సిద్ధమవుతున్నట్లు కూడా తెలిపారు.

Also Read: Madras High Court: భర్త మరణానంతరం మరో వివాహం చేసుకున్న భార్యలో ఆస్తిలో వాటా

Show comments