Site icon NTV Telugu

TVK Chief Vijay: హీరో విజయ్‌కి బిగుసుకుంటున్న ఉచ్చు.. అరెస్ట్ తప్పదా?

Tvk Chief And Actor Vijay

Tvk Chief And Actor Vijay

TVK Chief Vijay: ఢిల్లీలోని సీబీఐ అధికారుల ముందుకు టీవీకే అధినేత, హీరో విజయ్ మరోసారి హాజరయ్యారు. ఇటీవలే కరూర్ తొక్కిసలాట ఘటనలో సీబీఐ ముందు విజయ్ హాజరైన విషయం తెలిసిందే. ఆ టైంలో విజయ్ సీబీఐ విచారణలో కరూర్ తొక్కిసలాట ఘటనతో టీవీకే పార్టీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. అయినా కూడా మరోసారి తమ ఎదుట హాజరుకావాలని చెప్పడంతో సోమవారం ఢిల్లీ సీబీఐ కార్యాలయానికి వచ్చారు విజయ్.

READ ALSO: Ravi Teja Movies: రవితేజ సినిమాలు అంటే.. గ్లామర్ హీరోయిన్స్ ఉండాల్సిందే, లిస్ట్ పెద్దదే!

ఈక్రమంలో కరూర్‌ తొక్కిసలాట ఘటనలో తాజాగా విజయ్‌కి సీబీఐ విచారణ ముగిసింది. ఈ విచారణ సందర్భంగా హీరో విజయ్‌ను సీబీఐ అధికారులు సుమారు 6 గంటల పాటు ప్రశ్నించారు. ఆయనను ఈ రోజు సీబీఐ అధికారులు అనుమానుతుడిగా ప్రశ్నించారు. మొన్న నిర్వహించిన విచారణలో సీబీఐ ఆయనను సాక్షిగా ప్రశ్నించింది. ఫిబ్రవరి రెండో వారంలో విజయ్‌ పేరుతో ఛార్జిషీట్‌ వేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

తమిళనాడులో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో విజయ్‌ను సీబీఐ విచారణకు పిలవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా గతేడాది కరూర్‌లో నిర్వహించిన విజయ్ రాజకీయ ర్యాలీలో.. తమ అభిమాన నాయకుడిని చూసేందుకు ప్రజలు ఎగబడ్డారు. ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాట కారణంగా దాదాపు 41 మంది మరణించారు. ఈ ఘటన యావత్తు దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇక విజయ్ నటించిన ‘జన నాయగన్’ సినిమాపై కూడా వివాదం నడుస్తోంది. పొలిటికల్ నేపథ్యంలో సినిమా ఉండడంతో ఎన్నికల సమయంలో విడుదల కాకుండా ఆటంకాలు ఏర్పడుతున్నాయి.

READ ALSO: Karnataka DGP Viral Video: ఆఫీస్‌లో రాసలీలు.. డీజీపీ గారు ఏంటీ పని!

Exit mobile version