Siva karthikeyan Son Pavan: తమిళ నటుడు శివకార్తికేయన్, అతని భార్య ఆర్తి తమ కుమారుడికి ” పవన్ ” శివకార్తికేయన్ పేరు పెట్టారు. ఇటీవల జరిగిన వారి కొడుకు నామకరణం, ఊయల వేడుక సంబంధించి ఒక వీడియోను పంచుకున్నారు. పవన్ శివకార్తికేయన్, ఆర్తిలకు మూడవ సంతానం. ఇది వరకే వారికి కుమార్తె ఆరాధన, కుమారుడు గుగన్ పిల్లలు ఉన్నారు. జూలై 15న శివకార్తికేయన్ తన మూడవ బిడ్డకు పేరు పెట్టే వేడుక నుండి ఒక వీడియోను పంచుకున్నారు. అతను పోస్ట్‌కి “ఆరాధన – గుగన్ – పవన్ ” అని హార్ట్ ఎమోజితో క్యాప్షన్ జత చేసాడు.
Mukesh Ambani: మరోసారి ముఖేష్ అంబానీ కళ్ళలో కన్నీళ్లు.. వీడియో వైరల్..
ఈ వీడియోలో అతని భార్య, కుమార్తె, కుమారులతో పాటు వారి కుటుంబ సభ్యులతో కూడిన కొన్ని హృదయపూర్వక క్షణాలను పంచుకున్నాడు. జూన్ 2న ఆర్తి ఆరోగ్యకరమైన మగబిడ్డకు జన్మనిచ్చింది. ఒక రోజు తర్వాత శివకార్తికేయన్ తమిళం, ఇంగ్లీష్ లో ఆ విషయాన్ని పంచుకున్నారు. ఆ పోస్ట్ లో “జూన్ 2వ తేదీన జన్మించిన మా మగబిడ్డకు స్వాగతం పలుకుతున్నప్పుడు మా హృదయాలు ఆనందంతో ఉప్పొంగిపోతున్నాయి. మా కుటుంబం కొంచెం పెద్దదిగా మారుతుంది. మాకు మీ అందరి ప్రేమ, మద్దతు మరియు ఆశీర్వాదాలు అవసరం” అంటూ పోస్ట్ చేసాడు.
Viral News: తెలంగాణలో చెట్లెక్కుతున్న చేపలు.. చూసేందుకు ఎగబడుతున్న జనం..
శివకార్తికేయన్ చివరిసారిగా ‘అయలాన్’ సినిమాలో కనిపించారు. ఆ సినిమా జనవరి 2024లో థియేటర్లలోకి వచ్చింది. అతను ఇప్పుడు రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో తన రాబోయే చిత్రం ‘అమరన్’ సినిమా విడుదలకు రెడీగా ఉంది. సెప్టెంబర్‌లో ఈ చిత్రాన్ని గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. అంతేకాకుండా శివకార్తికేయన్ ఇప్పుడు AR మురుగదాస్ రాబోయే చిత్రం కోసం షూటింగ్ చేస్తున్నారు. దీనికి తాత్కాలికంగా ‘SK 23’ అని పేరు పెట్టారు.
Aaradhana – Gugan – PAVAN ❤️❤️❤️ pic.twitter.com/T0YNorVIQb
— Sivakarthikeyan (@Siva_Kartikeyan) July 15, 2024