Site icon NTV Telugu

Actor Sivaji: మహిళల డ్రెస్సింగ్ కామెంట్స్‌పై శివాజీ వివరణ.. “ఆ పదాలు వాడకుండా ఉండాల్సింది!”

Actor Sivaji

Actor Sivaji

Actor Sivaji: కోర్ట్ సినిమాలో మంగపతిగా ప్రత్యేకగా గుర్తింపును సొంతం చేసుకున్న నటుడు శివాజీ. ఆయన గతంలో హీరోగా ఎన్నో చిత్రాల్లో అలరించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఆయన ఒక సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో గతంలో చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. మహిళల డ్రెస్‌ల ఆధారంగా వారి క్యారెక్టర్‌ను డిసైడ్ చేయకూడదని చెప్పారు.

READ ALSO: Tata Punch EV Facelift: పాత పంచ్ EVతో పోలిస్తే ఫేస్‌లిఫ్ట్‌లో 5 కీలక మార్పులు..

ఈ సందర్భంగా ఆయన ఈ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తానేప్పుడు మాట్లాడే మాటలపై కంట్రోల్ లేకుండా మాట్లాడానని చెప్పారు. తాను గతంలో డ్రెస్సింగ్‌ గురించి కామెంట్స్‌ చేసిన టైంలో రెండు పదాలు వాడకుండా ఉండాల్సిందన్నారు. నిజానికి ఇవే మాటలను ఆ పదాలు వాడకుండా కూడా గతంలోనూ చెప్పానన్నారు. కానీ ఆరోజు ఎందుకు అలా మాట్లాడానో తెలియలేదని చెప్పారు. తర్వాత చూసుకుంటే ఆ పదాలు నేనే మాట్లాడానా? అని అనిపించిందన్నారు. నిజానికి ఆ తర్వాత ఎంతో మానసిక సంఘర్షణకు గురయ్యానని గుర్తు చేసుకున్నారు. వాస్తవానికి ఆ తర్వాత మూడు రోజులు నిద్ర కూడా పోలేదని చెప్పారు. ఇప్పటి వరకూ కొన్ని వందల ప్రెస్‌మీట్‌, డిబేట్‌లలో పాల్గొని మాట్లాడానాని, ఎప్పుడూ నోరు జారలేదని చెప్పారు. కానీ ఆ రోజు అలా జరిగిపోయిందన్నారు. తన వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం.. ఈ ప్రపంచంలో మగవారు ఎప్పుడూ కూడా ఉద్దేశపూర్వకంగా ఆడవాళ్లను కించపరచాలని అనుకోరని చెప్పారు. ఆ టైంలో తాను మహిళా కమిషన్‌కు ముందుకు వెళ్లినప్పుడు తనకు తెలిసినవాళ్లే తనపై కంప్లైంట్‌ చేశారని తెలిసి షాక్‌ అయ్యానని చెప్పారు. వాస్తవానికి తనపై కంప్లైంట్ చేసిన వాళ్లంటే ఇప్పటికీ తనకు గౌరవం ఉందన్నారు. అయితే ఎవరు తనపై కంప్లైంట్ ఇచ్చారనేది తాను చెప్పనని, అలా చెప్పడం కూడా కరెక్ట్‌ కాదన్నారు.

READ ALSO: IND vs SA Super 8: టీ20 వరల్డ్ కప్‌లో దక్షిణాప్రికాపై భారత్‌ డామినేషన్.. 2007 నుంచి మ్యాచ్‌ల ఫలితాలు ఇలా!

Exit mobile version